వచ్చే సమ్మర్‌కి... ఓకే... బంగారం
దర్శక - నిర్మాత మణిరత్నం ఇప్పుడు కొత్త సినిమా పనుల్లో ఉన్నారా? అవుననే అంటున్నాయి చెన్నైలోని కోడంబాకమ్ వర్గాలు. నగర వాతావరణం నేపథ్యంలో ప్రేమ, సహజీవనం, పెళ్ళి అంశాలతో ఆ మధ్య ‘ఓ.కె. బంగారం’ (తమిళ మాతృక ‘ఓ.కె. కాదల్ కన్మణి’) ద్వారా ఆయనకు మళ్ళీ మంచి హిట్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ ఆ చిత్రంలో హీరో.
ఇప్పుడు తీయబోయే కొత్త సినిమాలో కూడా దుల్కర్ ఒక హీరో, సూర్య తమ్ముడు కార్తీ మరో హీరో. ఈ ఇద్దరు హీరోలతో తీసేది ముక్కోణపు ప్రేమకథా, లేక మరొకటా అన్నది మణి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
అయితే, ఏ.ఆర్. రహమాన్ సంగీతం, రవి వర్మన్ ఛాయాగ్రహణం అందించే ఈ కొత్త సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయా లని మణిరత్నం ప్లాన్. ఆ మాట ఆయనే ఈ మధ్య లండన్‌లో వెల్లడిం చారు. సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో మణి మళ్ళీ వేగం పెంచినట్లున్నారు. శుభం.