OKeefe
-
కుంబ్లే లెఫ్టార్మ్ స్పిన్‌తో...
తప్పులు సరిదిద్దుకున్న పుజారా రాంచీ: అనిల్ కుంబ్లే జగద్విఖ్యాత లెగ్ స్పిన్నర్‌గానే మనకందరికీ తెలుసు. ప్రస్తుత భారత జట్టు ప్రధాన కోచ్‌గా కీలక పాత్ర పోషిస్తున్న కుంబ్లే, ఒక బౌలర్‌గా కూడా నెట్స్‌లో జట్టుకు ఎంతో సహకరిస్తున్నారు. అయితే బెంగళూరు టెస్టుకు ముందు ఆయన, చతేశ్వర్ పుజారాతో చేయించిన ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడింది. పుజారాకు సహకరించేందుకు కుంబ్లే అనూహ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా మారిపోవడం విశేషం. పుణే టెస్టులో పుజారాను ఇబ్బంది పెట్టిన ఒకీఫ్‌ను ఎదుర్కొనేందుకు జంబో ఈ తంత్రం ప్రయోగించారు. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా చేసిన 92 పరుగులు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. -
మ్యాచ్ ఓడిన ర్యాంకులు పదిలం
దుబాయి: తొలి టెస్టు విజయంతో ప్రశంసలు అందుకుంటున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఘనత సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కెరీర్లోనే అత్యుత్తమ (939) పాయింట్లు సాధించి టెస్టు ర్యాంకుల్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దీంతో అత్యదిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల సరసన చేరాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ సాధించడంతో స్మిత్‌కు ఆరు పాయింట్లు కలిసాయి. అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాళ్ల లిస్టులో స్మిత్ ఆరోవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో బ్రాడ్‌మన్ (961), లెన్ హట్టన్ (945), జాక్ హబ్స్, రికీపాటింగ్‌లు (942), పీటర్ మే (941) పాయింట్లతో తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. వివి రిచర్డ్స్, సంగాక్కరల (938)ల స్థానాన్ని స్మిత్ అధిగమించాడు. భారత్ ఓటమిలో కీలకపాత్ర పోషించిన ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఒకీఫ్ 33 స్థానాలు అధగమించి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు 29 సాధించాడు. ఈ ర్యాంకుల్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అశ్విన్, జడేజాలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కోహ్లి 873 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ బౌలర్, ఆల్‌రౌండర్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. జడేజా బౌలింగ్‌లో రెండవ ర్యాంకు, ఆల్రౌండర్లో మూడో ర్యాంకుల్లో కొనసాగుతున్నాడు. ఇక తొలి టెస్టులో పర్వాలేదనిపించిన కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్‌లు కెరీర్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రాహుల్ 11 ర్యాంకులు ఎగబాకి 46వ ర్యాంకు పొందాడు. యాదవ్ నాలుగు స్థానాలు అధగమించి 30వ ర్యాంకు సాధించాడు. -
దిగ్గజాల సరసన చేరిపోయాడు..
పుణె: ఆస్ట్రేలియా స్పిన్నర్ ఓకీఫ్.. భారత పర్యటనకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన క్రికెటర్. ఈ టెస్టుకు ముందు కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఓకీఫ్ పై ఆసీస్ కూడా భారీ ఆశలు కూడా పెట్టుకోలేదు. భారత్ లోని పిచ్‌లు స్సిన్ కు అనుకూలిస్తాయి కాబట్టి ఓకీఫ్ కు ఆసీస్ జట్టులో స్థానం కల్పించారు. అయితే ఇప్పుడు ఓకీఫ్ ఒక్కసారిగా హీరోగా మారిపో్యాడు. అసలు సొంతగడ్డపై గత 20 మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేని భారత్ కు గట్టి షాకిచ్చి సెలబ్రెటీ అయిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఓకీఫ్ సాధించిన వికెట్లు 12. తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసిన ఓకీఫ్.. రెండో ఇన్నింగ్స్ లో్ కూడా 35 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. మరొకవైపు దిగ్గజాల సరసన కూడా చేరిపోయాడు ఓకీఫ్. భారత్ పై భారత్ లో ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా ఓకీఫ్ నిలిచాడు. ఈ రికార్డు పరంగా ఇంగ్లండ్ మాజీ పేసర్ ఇయాన్ బోథమ్ ముందు వరుసలో ఉన్నాడు. 1980, ఫిబ్రవరి 15వ తేదీన భారత్ తో ముంబైలో జరిగిన టెస్టులో ఇయాన్ బోథమ్ ఒక టెస్టు మ్యాచ్‌లో 13 వికెట్లు సాధించాడు. ఆ తరువాత వరుసగా ఓకీఫ్ రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఆపై ఫజాల్ మొహ్మద్(పాకిస్తాన్), ఏమీ రాబర్ట్స్(వెస్టిండీస్), డేవిడ్ సన్(ఆస్ట్రేలియా)లు ఉన్నారు.