వినతులు మావి.. పరిష్కారం మీది
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూలో నిల్చొని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంకు వినతు లు, ఫిర్యాదులు అందజేశారు. సమస్యలు పరి ష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. గ్రీవెన్స్ సెల్ లో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ-2 పి.రజనీకాంతారావు, డీఆర్వో బి.హేమసుం దర వెంకట్రావు, డుమా పీడీ ఆర్.కూర్మనాథ్, జెడ్పీ సీఈవో వసంతరావు, ముఖ్య ప్రణాళికా అధికారి ఎం.శివరామనాయకర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్య నిర్వాహక ఇంజి నీరు టి.శ్రీనివాసరావు, ఉప విద్యాశాఖాధికారి ఎ.ప్రభాకరరావు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని...
= వంశధార చానల్‌ను కప్పేసి తమ భూములకు సాగునీరు అందకుండా చేస్తున్నారంటూ సరుబుజ్జిలి మండలంలోని చిగురువలస గ్రామానికి చెందిన రైతులు టి.రాంబాబు, సీహెచ్ గోపాల కృష్ణ తదితర రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సాగునీటి అడ్డంకులు తొలగించాలని కోరారు.
= గ్రామంలో ఎలాంటి పనులు చేయకుండానే రూ.7 లక్షల నిధు లు స్వాహా చేశారని, సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలంటూ జలుమూరు మండల రాణా పంచాయతీకి చెందిన బొమ్మాళి సిం హాచలం, పి.రామారావులు విజ్ఞప్తి చేశారు.
= పలాస మండలంలోని రాజగోపాలపురం, ఉదయంపూరంలోని భూము లు ఆక్రమణలకు గురయ్యాయని, సర్వే చేసి ఆక్రమణలు తొలగిం చాలంటూ కొంచాడ రామూర్తి కలెక్టర్‌కు విన్నవించారు.
= గతంలో రూ.70కి వచ్చే కూబిక్ మీటరు ఇసుకను టీడీపీ ప్రభుత్వం 650కి పెంచేసిం దని, దీంతో ఇళ్లనిర్మాణాలు నిలిచిపోతున్నాయని, పేదలు ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నారని, తక్షణమే ధరలు తగ్గించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు మంతెన హరనాథ్, ఎం.ఆదినారాయణ మూర్తి తదితరులు కలెక్టర్‌కు కోరారు.
= రేగిడి ఆమదావలస మండలంలోని గుళ్లపాడు గ్రామానికి పక్కారోడ్డు వేయాలని గ్రా మానికి చెందిన యువకులు వి. హరికృష్ణ, జి. రవి, డి.కిరణ్. కె.హరి, జి.కృష్ణారావులు కోరారు.
= హుద్‌హుద్ తుపాను తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు రవాణా చార్జీలను ఇప్పటికీ చెల్లించలేదని బీజేపీ ప్రతినిధులు ైపైడి వేణుగోపా లం, పూడి తిరుపతిరావు, ఎస్.ఉమామహేశ్వరి, సంపతరావు నాగేశ్వరరావు, బి.వి.రెడ్డిబాబు, పి.సత్యం, చల్లా వెంకటేశ్వరులు ఫిర్యా దు చేశారు.
= అంగన్వాడీ కార్యకర్త నియామకంలో రోస్టర్ విధానాన్ని పాటించకుండా సంతబొమ్మాళి మండలం పందిగుట్ట గ్రామంలో ఎస్సీకి కేటాయించిన పోస్టును బీసీని నియమించారని, మంత్రి, ఆర్డీవోలే దీనికి బాధ్యులని, తక్షణమే ఎస్సీ లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ కుల నిర్మూలనా పోరాట సమి తి ప్రతినిధులు బెలమాన ప్రభాకర్, పి.పాపారావు, కె.వెంకట్రావు విన్నవించారు.
= రిమ్స్, పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీల్లో స్వచ్ఛంద సంస్థ సభ్యులకు సభ్యత్వం కల్పించాలని కె.వసంతకుమార్ కోరారు.
= కేశవరెడ్డి పాఠశాలలో పిల్లల చదువుల కోసం చేసిన డిపాజిట్ చెల్లింపులో యాజమాన్యం జాప్యం చేస్తోందని, స్పష్టమైన సమాచా రం ఇవ్వడంలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రు లు టి.వి.రమణ, ఎం.చంద్రమౌళి, వి.లలితకుమారి, కె.త్రినాథరావులు ఫిర్యాదు చేశారు.
=ఎస్‌హెచ్‌జీలతో హెల్మ్ట్లు విక్రయించాలని డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జిల్లావాసులు ఫోన్లో తెలిపిన సమస్యలు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోలార్లైట్లకు వినతి
గిరిజన దర్బార్‌లో వినతులు
సీతంపేట: బూర్జ మండలం బండిలోయం, చిన్నచలం, గుడ్డలమేడ గ్రామాలకు సోలార్లైట్లు మంజూరు చేయాలని ఆ గ్రామాల గిరి జనులు పీఎంఆర్సీలో సోమవారం నిర్వహించిన గిరిజనదర్బార్‌లో కోరారు. దర్బార్‌లో పీఓ జల్లేపల్లి వెంకటరావు స్వయంగా వినతులు స్వీకరించారు. వలగజ్జి ఎగువగూడలో మంచినీటి సమస్య ఉందని, బావి అడుగంటిందని సర్పంచ్ శాంతమ్మతో పాటు గిరిజనులు కోరారు. నెల్లిగండి- ఈతమానుగూడ రహదారి నిర్మించాలని కె.బుగత కోరారు. హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పించాలని కె.కూర్మారావు కోరారు. ఐదోతరగతిలో ప్రవేశానికి మినీగురుకులంలో సీటు ఇప్పించాలని ఎం.దివ్య కోరారు.
భూతగాదా పరిష్కరించాలని కొత్తపసుకుడికి చెందిన కె.సుగ్రీవులు వినతిపత్రం సమర్పించారు. లివిరి జంక్షన్ నుంచి మూలగూడ, బూర్జగూడలకు రహదారి నిర్మించాలని సర్పంచ్ సిరంగి విన్నవించారు. కంగారు గుమ్మిగెడ్డ వద్ద మినీ రిజర్వాయర్ నిర్మించాలని తాడిపాయి గ్రామానికి చెందిన గంగారావు కోరారు. ఏపీఆర్ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పించాలని అయ్యప్పగూడకు చెందిన బి.శ్రీనివాసరావు విజ్ఞాపన అందించారు. దర్బార్‌లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఈఈలు శ్రీనివాస్, రమణ, డీడీ ఎం.పి.వి.నాయక్, డిప్యూటీ డీఈవో మల్లయ్య, ఎంపీడీవో రవణమ్మ, తహశీల్దార్ సావిత్రి, హౌసింగ్ డీఈ విక్టర్, ఎస్ఎంఐ డీఈ ఉషారాణి, ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు పది వినతులు
శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఎస్ ఖాన్ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు పది వినతులు వచ్చాయి. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. వినతుల్లో సివిల్ తగాదాలకు చెందినవి రెండు, ఇప్పటికే నమోదైన కేసుల విషయంలో పరిష్కారం కోరుతూ ఐదు, ఇతర కారణాలకు చెందినవి మూడు ఉన్నాయి. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు 18 వినతులు వచ్చాయి. వాటిలో పాతవి ఆరు వినతులు ఉన్నాయి. కార్యక్రమంలో ఓఎస్డీ కె.తిరుమలరావు, సీసీఎస్ డీఎస్పీ కె.వేణుగోపాలరావు, ఎస్సీ, ఎస్టీసెల్ డీఎస్పీ పెంటారావు, న్యాయ సలహాదారుడు ఆఫీస్‌నాయుడు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, డీఆర్డీఏ (వెలుగు) నుంచి డి.విజయకుమారి, ఏసీడీఎస్ కె.నిర్మల, విశ్రాంత ఎస్ఐ పి.రాజేశ్వరరావు, అడ్వకేట్లు టి.వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.