old woman suffers
-
వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు..
సాక్షి, కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల): దగ్గరి బంధువని చేరదీస్తే ఉన్న ఆస్తి రాయించుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధురాలినే ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటున్నాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని నిమ్మపల్లికి చెందిన మానుక రాజయ్య–నర్సవ్వ దంపతులకు పిల్లలు లేరు. కొన్నేళ్ల క్రితం నుంచి దగ్గరి బంధువు మానుక శంకర్ వారింట్లోనే ఉంటున్నాడు. రాజయ్యకు ఫించన్ ఇప్పిస్తానని చెప్పి ఆస్తి కాగితాలపై సంతకాలు చేయించుకుని ఇల్లు, 30 గుంటల భూమిని తనపేరిట చేయించుకున్నాడు. రాజయ్య నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. ఈక్రమంలో ఒంటరి అయిన నర్సవ్వకు తిండి పెట్టకపోవడంతో శంకర్‌ను నిలదీయగా ఇది తనదని, వెళ్లిపొమ్మంటూ కొడుతున్నాడని బాధితురాలు రోదిస్తూ చెప్పింది. శంకర్ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకుంది. గ్రామానికి వచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తానని వృద్ధురాలికి ఎస్సై రాజశేఖర్ హామీ ఇచ్చారు. కన్న కొడుకులు కూడు పెడ్తలేరు వేములవాడ: కనీ పెంచి పెద్దచేసిన కొడుకులు మలిసంధ్యలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండలంలోని నిజామాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమ బాధను చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీరాముల రామయ్య–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు దేవయ్య, లచ్చయ్య, చంద్రయ్య. వృద్ధులు కావడంతో ఒక్కో కొడుకు దగ్గర 3 నెలలు ఉండాలని నిర్ణయించారు. కానీ గత కొన్ని నెలలుగా దేవయ్య, లచ్చయ్య తల్లిదండ్రులను పోషించడంలేదు. ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్న కుమారుడు చంద్రయ్య వద్దే ఆరునెలల నుంచి ఉంటున్నారు. సోమవారం ఎస్సై రాజశేఖర్‌ను కలిసి తన ఇద్దరు కుమారులు పోషించడంలేదని ఫిర్యాదు చేశారు. కుమారులను పిలిపించి మాట్లాడుతానని బాధితులకు ఎస్సై హామీ ఇచ్చారు. చదవండి: భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే -
ఈ అవ్వకు ‘ఆసరా’ ఏది?
వేమనపల్లి(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కోట సమ్మక్క శతాధిక వృద్ధురాలు.. నడవలేని స్థితిలో ఉంది. ఆమెకు ఆసరా పింఛన్ అందడం లేదు. పెన్షన్ ఇప్పించమని ఇప్పటికి ఆరుసార్లు దరఖాస్తు చేసుకుంది. 2016 మార్చి నుంచి ఆ వృద్ధురాలికి పింఛన్ వస్తుంది. కానీ పంపిణీ చేసే అధికారులే కుటుంబానికి తెలియకుండా పెన్షన్ స్వాహా చేశారు. సమ్మక్క కూతురు ఏమ లస్మక్క భర్త గతంలో మత్యువాతపడడంతో తల్లివద్దే ఉంటోంది. ఇద్దరూ కలిసి వేమనపల్లిలో సమ్మక్క కుమారుడు కోట రాజం వద్ద ఉంటున్నారు రాజం సైతం రెండేళ్ల క్రితం మృతిచెందగా కోడలు మల్లక్కే వారికి దిక్కయ్యింది. విచిత్రం ఏమిటంటే వృద్ధురాలైన సమ్మక్కకు పెన్షన్ రావటం లేదు. కానీ ఆమె కూతురు లస్మక్కకు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. వారం రోజుల క్రితం పెన్షన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఆమెకు అసలు విషయం తెలిసింది. సమ్మక్కకు 2016 మార్చి నెలలోనే పెన్షన్ మంజూరైనట్లు జాబితాలో ఉంది. స్థానికంగా ఉండటం లేదని చూపించారు. మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల ఒకసారి అధికారులే డ్రాచేశారు. ఆ తర్వాత జూన్, జులై నెలల పెన్షన్ ఆగస్టులో అధికారులే స్వాహా చేశారు. అప్పటి నుంచి వృద్ధురాలు స్థానికంగా ఉండటం లేదని పెన్షన్ రద్దుచేశారు. పెన్షన్ కాజేయటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు విషయం బయటికి పొక్కకుండా కుటుంబ సభ్యుల దరఖాస్తును తీసుకుని మళ్లీ మంజూరుకు పంపారు. పెన్షన్డ్రా అయినట్లు ఆన్లైన్లో చూపిస్తున్న దృశ్యం -
ఏడిపింఛెన్.. !
హిందూపురం టౌన్ : పింఛన్ కోసం పాట్లు తన ప్రాణాలమీదకొచ్చాయంటోంది.. హిందూపురానికి చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ. పట్టణంలోని బెంగళూరు రోడ్డులో నివాసముంటున్న లక్ష్మమ్మ కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటోంది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిగా ఆమెకు పింఛన్ అందడం లేదు. ఇదే విషయమై మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి దృష్టికి ఏడాది క్రితం తీసుకెళ్లింది. నాటి నుంచి ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆమె మున్సిపల్ కౌన్సిల్ హాలులోనే సొమ్మసిల్లి పడిపోయింది. అయినా ఏ ఒక్కరూ వృద్ధురాలిని పలకరించకపోవడం దురదృష్టకరం.