నాగార్జున కొత్త సినిమా పేరు ఖరారు
తిరుమల: అక్కినేని నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు 'ఓం నమో వెంకటేశాయ' పేరు ఖరారు చేశారు. నాగార్జున, రాఘవేంద్రరావు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబా పాత్ర పోషించనున్నారు. ఈ నెల 25న సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందిస్తున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది.