ముద్దుల ఉత్సవం
ఇండోనేషియాలోని బాలి ప్రాంతం పెద్ద సాంస్కృతిక కేంద్రం. అక్కడ జరిగే ఎన్నో వేడుకల్లో ‘ఒమెడ్ ఒమెడన్’ ఒకటి. ఇది ముద్దుల ఉత్సవం! ప్రేయసీప్రియుల బహిరంగ చుంబనానికి ఆమోదం దొరికే అవకాశం. అమ్మాయిలు సిగ్గుల మొగ్గలు అవుతుండగా, దొరల్లా అబ్బాయిలు ముద్దుల్ని దొంగిలిస్తారు. చుట్టూవున్నవారు నీళ్లు జల్లుతూ వాళ్లను ఉత్సాహపరుస్తారు. ఇలా ముద్దాడినవాళ్లకు ఆరోగ్యం కలుగుతుందనీ, ఊరికి అరిష్టం దూరమవుతుందనీ అక్కడి నమ్మకం. అవన్నీ ఏమోగానీ యౌవనానికి తగిన గౌరవం!