One crore jobs
-
రూ. కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే!
Dog Nanny Job: చదువుకున్నవారికే ఉద్యోగాలు రావడం కరువైపోతున్న ఈ రోజుల్లో కుక్కను చూసుకుంటే చాలు కోటి జీతం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని కోసం ఇప్పటికే సుమారు 400 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, లండన్‌కి చెందిన ఒక బిలీనియర్ తన కుక్కను చూసుకోవడానికి ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసాడు. అంతే కాకూండా కుక్కను చూసుకునే వారికి 42 రోజులు సెలవులు, దానిని ఎక్కడికి తీసికెళ్తే అక్కడికి లగ్జరీ జెట్‌లో ప్రయాణించే ఛాన్స్ కూడా కల్పించనున్నాడు. ఆ సమయంలో భోజనంతో పాటు అన్ని రకాల ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉచితంగానే అందిస్తారు. (ఇదీ చదవండి: బన్నీ మంచి బిజినెస్మెన్ కూడా! ఈ కంపెనీలన్నీ తనవే..) ఈ జాబ్‌లో భాగంగా ప్రతి రోజు కుక్కలకు ఆహారం అందించాలి. వాటికి అనారోగ్య సమస్యలు ఎదురైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ప్రతి రోజు స్నానం చేయించాలి. ఇలా రోజు వాటి అవసరాలను చూసుకుంటే చాలు, వారు ఏడాదికి రూ. కోటి జీతం పొందవచ్చు. అయితే అవి తినే ఆహారం మీద పూర్తిగా అవగాహన ఉండాలని చెబుతున్నారు. అంతే కాకుండా వారు వారి జీవితం కంటే కుక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. -
బీజేపీకి అధికారమిస్తే కోటి ఉద్యోగాలు
ఆగ్రా: కేంద్రంలో బీజేపీకి అధికారం ఇస్తే యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వాగ్దానం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు యూపీఏ మాటచ్చినా నిలబెట్టుకోలేకపోయిన ఆ హామీని తాము నెరవేరుస్తామని గురువారమిక్కడ జరిగిన ఎన్నికల భారీ సభలో చెప్పారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వాళ్లు ఉన్నారని, వాళ్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారని తెలి పారు. అవినీతిమయమైన కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తూ చెదపురుగుల్లా దేశాన్ని తినేస్తోందని మోడీ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అలాంటి చెదపురుగుల నుంచి దేశానికి విముక్తి కలిగించాలని, దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే బీజేపీకి అధికారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో ఎస్పీ, బీఎస్పీపై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌లాగే ఆ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, ఇప్పుడు వారిస్తున్న కలరింగుతో ఆ వన్నెలు బయటపడుతున్నాయన్నారు.