ఆ జంతువుకు సాయుధ బాడీ గార్డ్స్!
జంతువుకు సాయుధ బాడీ గార్డ్స్ ఏంటీ అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. ఆ జంతువుకు చుట్టూ పదుల సంఖ్యలో బాడీ గార్డ్స్. దానిపై ఈగ కూడా వాలకుండా, ఏ లోటూ రాకుండా చూసుకుంటారు. అది ఎక్కడకు వెళ్తే అక్కడకు వాళ్లు కూడా దాని వెంటే ఆయుధాలు పట్టుకుని నడుస్తూ వెళ్తారు. రోజంతా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కెన్యాలోఓ రైనోకు జరుగుతున్న మర్యాదలు ఇవి.
ప్రపంచంలో అంతరించిపోవడానికి అత్యంత దగ్గరలో ఉన్న జంతుజాతికి చెందినవి నార్తర్న్ వైట్ రైనోస్. అందులోనూ ఈ భూమ్మీద ఈ జాతికి చెందిన మగ రైనో ఒక్కటే ఉంది. దీంతో కెన్యా ప్రభుత్వం దానిని రక్షించుకోవడానికి భారీ చర్యలే చేపడుతోంది. దానికి ఎటువంటి హాని కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసింది. కెన్యాలో ఈ జాతికి చెందిన ఆడ రైనోలు రెండు ఉన్నాయి. ఎలాగైనా వీటితో మగ రైనోను సంపర్కం జరిపించి ఆ జాతిని అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో వయస్సు మీద పడిన ఏకైక మగ రైనోకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా కూడా ఈ చర్యలు తీసుకుంటున్నారు.