ఒక శాతం ప్రజల చేతిలో 47 శాతం సంపద
వాషింగ్టన్: తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని ఒక శాతం ప్రజల దగ్గర 47 శాతం సంపద ఉన్నట్టు వెల్లడైంది. ప్రపంచ జనాభాలోని ఒక మిలియన్(18 .8మిలియన్) ప్రజల దగ్గర మొత్తం సంపదలో 78.8 ట్రిలియన్ డాలర్ల సంపద ఉన్నట్టు అమెరికాలోని బోస్టన్ కన్సట్లింగ్ రిపోర్టు తెలిపింది. నగదు,ఆర్థిక లావాదేవీలు, ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ ఆధారంగా మొత్తం ప్రపంచ సంపదలో 47 శాతం ఒక శాతం వారి దగ్గర ఉన్నట్టు వివరించింది.
2013-14 మద్య 45 శాతంగా ఉన్నవీరు 2014-15 నాటికి 47 శాతానికి పెరగడంపై ప్రపంచంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇందులో అమెరికా మొదటి స్థానంలో ఉండగా,తర్వాత స్థానంలోచైనా,జపాన్ లు నిలిచాయి. ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడమే ఇందుకు కారణం మని నివేదిక తెలిపింది.