డీలర్లకు ‘రేషన్’ చిక్కులు
► పౌరసరఫరాల శాఖ వద్ద బకారుులు
► మళ్లీ డీడీలు తీయూలని ఆదేశాలు
► ఆందోళనలో దుకాణాదారులు
గోదావరిఖని : పౌరసరఫరాల శాఖ వద్ద ఇప్పటికే తీసిని డీడీలున్నా సరుకుల కోసం మళ్లీ సొమ్ము చెల్లించాలని అధికారులు ఆదేశించడంతో రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రామగుండం నియోజకవర్గంలో 99 రేషన్ దుకాణాలున్నాయి. జూన్ కోటా చక్కెర కోసం ఆన్లైన్లో డీడీలు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. కానీ గత నవంబర్లోనే కందిపప్పు కిలో రూ.49.50 చొప్పున రూ.వేల విలువైన డీడీలు కట్టారు. పప్పు నేటికీ సరఫరా కాలేదు. దీనికి సంబంధించిన నిధులు డీలర్లకు వాపసు ఇవ్వలేదు. మార్చి, ఏప్రిల్లో చక్కెర కోటాకు చెల్లించిన డీడీలూ అలాగే ఉన్నారుు.
చక్కెర కోటా సైతం రాలేదు. ఏప్రిల్కు సంబంధించి ఒక్కోకార్డుకు ఐదు కిలోల గోధుమల కోసం కిలో రూ.1.85 చొప్పున పౌరసరఫరాల శాఖకు డీడీలు ముట్టజెప్పారు. గోధుమలు గోదాముల నుంచి విడుదల కాలేదు. వీటిసొమ్మంతా పౌరసరఫరాల శాఖ వద్దనే డీడీల రూపంలో ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంది. తాజాగా జూన్ చక్కెర కోటాకు డీడీలు చెల్లించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశించడంతో డీలర్లు అయోమయూనికి గురవుతున్నారు. ఆ సొమ్మును ఆన్లైన్లో చూసుకుని సర్దుబాటు చేసుకోవాలని వారు కోరుతున్నారు.