ఆకాశంలో విమానం డోర్ తెరవబోయి..
లండన్: కేఎల్ఎమ్ విమానం ఎడిన్బర్గ్ నుంచి ఆమ్స్టర్డామ్కు బయల్దేరింది. సముద్ర మట్టానికి 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో స్కాట్లాండ్కు చెందిన జేమ్స్ గ్రే అనే ప్రయాణికుడు విమానం డోరు తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది అవాక్కయ్యారు. అతన్ని మార్గమధ్యంలోనే విమానంలో నుంచి దించేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో జేమ్స్‌ను అరెస్ట్ చేశారు.
జేమ్స్‌కు దాదాపు 45 వేల రూపాయలు జరిమానా విధించారు. దీంతో పాటు ఐదేళ్ల పాటు కేఎల్ఎమ్ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించారు. అయితే జేమ్స్ మాత్రం విమానం డోర్ తెరవలేదని చెప్పాడు. టాయ్‌లెట్ డోర్ అనుకుని పొరపాటుగా విమానం డోర్‌ను కేవలం తాకానని అన్నాడు. తాను ప్రయాణించేందుకు కేఎల్ఎమ్ సిబ్బంది అంగీకరించలేదని, స్నేహితుడి సాయంతో మరో విమానంలో ఆమ్స్టర్డామ్ చేరుకున్నానని చెప్పాడు.