గంజాయితోట ధ్వంసం
తూర్పుగోదావరి: రాఘవాపురం పంచాయతీ పరిధిలోని సార్లంక, దబ్బాజీ గ్రామ అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్న గంజాయి తోటను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేబీవీ శాస్త్రి ఆధ్వర్యంలో శనివారం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. గంజాయిని మూడు ఎకరాలలో సాగు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
(రైతులపూడి)