ఓపో ఎఫ్3 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఓపో తాజాగా ఎఫ్3 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా దీని ప్రత్యేకత. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, అలాగే గ్రూప్ సెల్ఫీల కోసం 120 డిగ్రీల కోణంలో చిత్రాన్ని తీయగల 8 ఎంపీ కెమెరాను సైతం పొందుపరిచారు. వెనుకవైపు 13 ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ఇన్–సెల్ స్క్రీన్, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్–5, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4జీ డ్యూయల్ సిమ్, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, మెటల్ బాడీ, ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ వంటి ఫీచర్లను జోడించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌తోపాటు ఓపో ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ ఇది లభిస్తుంది. ధర రూ.19,990. మే 12 వరకు ప్రీ–ఆర్డర్లు స్వీకరిస్తారు. మే 13 నుంచి విక్రయాలు ప్రారంభం. హైదరాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ తెలంగాణ సీఈవో జోన్, నటి అదా శర్మ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.