oppression
-
భారత్, బంగ్లాదేశ్ రెండూ ఒక్కటే
జమ్మూ: భారత్‌లోని మైనారిటీల పరిస్థితి మాదిరిగానే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై అణచివేత కొనసాగుతోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులు అణచివేతకు గురవుతున్నారని వింటున్నాం, మరి మన దేశంలోని మైనారిటీలు కూడా అలాంటి అనుభవాలనే చవిచూస్తున్నారు. రెండూ ఒక్కటే. నాకైతే తేడా కనిపించడం లేదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు బాగో లేవన్నారు. ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో ఏఎస్ఐ సర్వే వ్యవహారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దర్గాను కూడా తవ్వేస్తారా. ఇలా ఎంతకాలం?’’ అని ముఫ్తీ ప్రశ్నించారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించే శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోకుంటే 1947 నాటి ఘర్షణలు పునరావృత్తమయ్యే ప్రమాదముంది’’ అన్నారు. -
ఇకపై నిర్ణయించేది మేమే!
మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఈ ఆధునిక యుగంలో కూడా ఈ స్థాయిలో ఉందా? అపర్ణ ఏర్పాటు చేసిన రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి తెలిసినప్పుడు ఎదురయ్యే సహజమైన సందేహం ఇది. అయితే మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఆధునిక యుగంలోనే ఎక్కువగా ఉందంటోంది అపర్ణా అచరేకర్. ఇరవై ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఆమెకు నేర్పిన వాస్తవం ఇది. మహిళ పట్ల అణచివేత భౌతికంగా తగ్గినట్లు అనిపిస్తుందేమో కానీ మానసికంగా ఎక్కువైందంటోందామె. తమకంటూ ఒక గుర్తింపు, స్వాతంత్య్రం, తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోగలిగిన సమాజం కోసం ఆమె సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అనే కొత్త పాత్రలోకి ఒదిగిపోయారు. ‘ఈవ్ వరల్డ్’ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ అచరేకర్. ముంబయికి చెందిన అపర్ణా అచరేకర్ మహిళల కోసం పని చేయాలనే సంకల్పం కలిగిన వెంటనే గత ఏడాది అక్టోబర్ నెలలో ఆచరణలోకి దిగింది. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగిన వేదిక అది. ఒకరు మరొకరిని ప్రభావితం చేసుకోగలిగిన అవకాశం ఈ వేదిక ద్వారా లభిస్తోంది. ‘‘ఐడెంటిటీ, ఇండిపెండెన్స్, ఇన్‌క్లూజన్’ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయమవుతారు, ఆ స్థానంలో నిలబడడం కోసం పరస్పర సహకరించుకుంటారు, తమ జీవితాలకు అవసరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు. అలాగే మగవాళ్లు నిర్దేశించిన నియమావళిని రూపుమాపడానికి కృషి చేస్తారు. కొత్త నియమావళిని మహిళలే నిర్ణయిస్తారు. మొత్తానికి మహిళలు తమకంటూ ఒక స్పేస్‌ని ఈ వేదిక ద్వారా క్రియేట్ చేసుకోగలుగుతారు’’ అని చెప్తోంది అపర్ణ. అందం కొలతల్లో ఉండదు! ‘‘మన భారతీయ సమాజం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మహిళ విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంది. ‘ఆడవాళ్లు ఎలా ఉండాలి...’ అనే నియమాలను మగవాళ్లే రూపొందిస్తుంటారు. ఆడవాళ్లు ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. అలాగే మెంటల్ హెల్త్ నుంచి మెన్స్ట్రువల్ టాబూ వరకు మహిళల స్వేచ్ఛను నిరోధించే శక్తిగా ఉంటోంది మగవాళ్ల భావజాలం. వీటికి భిన్నంగా మహిళలు వ్యవహరిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడడానికి ఏ మాత్రం సందేహించరు. ‘ఆడవాళ్ల విషయంలో తీర్పులివ్వడానికి మనం ఎవరు?’ అనే ప్రశ్న తమను తాము వేసుకునే మగవాళ్లు ఎందరు? వీటన్నింటికీ చరమగీతం పాడుతూ మహిళలు కొత్త నియమావళిని రూపొందిస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేసింది అపర్ణ. సోషల్ మీడియా వేదికగా రకరకాల వేధింపులు, సైబర్ బుల్లీయింగ్‌కు గురవుతున్న మహిళలకు తమ భావవ్యక్తీకరణకు ఇది ఒక సురక్షితమైన వేదిక అవుతుంది. ఆడవాళ్లు ఎలా ఉండాలి... ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. -
Afghanistan: ఇంటికి పో.. ఇంకెప్పుడూ రాకు!
Afghanistan Crisis: కుక్కతోక వంకరేనని మరోమారు తాలిబన్లు రుజువు చేస్తున్నారు. దేశాన్ని అధీనం చేసుకున్న తొలి రోజుల్లో ఎంతో మారిపోయినట్లు ఫొజులిచ్చిన తాలిబన్ మూకలు క్రమంగా తమ పాత నిజ స్వరూపాలను బయటపెడుతున్నాయి. మహిళా హక్కులు కాపాడతామంటూ గంభీర ప్రకటనలిచ్చి రోజులు గడవకముందే మహిళలపై తీవ్ర అణిచివేత చూపుతున్నారు. దేశమంతా పలు ప్రాంతాల్లో స్త్రీలపై తాలిబన్ల అణిచివేత, అకృత్యాలపై వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా తుపాకీ గురిపెట్టి మరీ తనను టీవీలో కనిపించవద్దంటూ తాలిబన్లు ఆదేశించారని ప్రముఖ మహిళా టీవీ ప్రజెంటర్ మెహ్ ముర్సల్ అమిరి వెల్లడించారు. అఫ్గాన్ నేషనల్ టీవీకి చెందిన ఆర్టీఏ స్టూడియోస్‌లో ఆమె పనిచేస్తున్నారు. ఈ స్టూడియోను ఆక్రమించిన తాలిబన్లు ముర్సల్కు తుపాకీ గురిపెట్టి ‘‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’’ అని బెదిరించారు. మేకప్ వేసుకున్నందుకు, హిజాబ్ ధరించనందుకు ఆమెను తీవ్రంగా దూషించారు. తోటి యాంకర్లను సైతం ఆఫీసుకు రావద్దని హెచ్చరించారు. ఒకపక్క మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చి మారినట్లు చెప్పుకుంటున్న తాలిబన్లు మరోపక్క మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంధకార భవితవ్యం... దేశంలో స్త్రీల భవిష్యత్ అంధకారంలోకి జారిందని ముర్సల్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత దిగజారుతాయని ఆందోళన చెందారు. లా డిగ్రీ చదువుతున్న ముర్సల్ టీవీలో వారానికి ఆరురోజుల పాటు సాగే 2 గంటల లైవ్‌షో నిర్వహిస్తారు. టీవీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి ఆదరణ ఉంది. ఎప్పటిలాగే ప్రోగ్రామ్ చేసేందుకు స్టూడియోకు వెళ్లానని, అనంతరం తాలిబన్లు స్టూడియో ను ఆక్రమించారని ముర్సల్ చెప్పారు. స్టేషన్లో ఉన్న మహిళలందరినీ వెంటనే వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు తెలిపారు. పురుష సిబ్బందిలో చాలామందిని కూడా తాలిబన్లు తొలగించారని ఆమె చెప్పారు. ‘‘టీవీ స్టూడియోను చూస్తుంటే ఏదో మసీదులో కొందరు పురుషులు కూర్చొని షరియా చట్టం గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. అసలు మహిళలనే వారు ప్రపంచంలో ఉన్నట్లే అనిపించడంలేదు. నాకు భవిష్యత్‌పై, ఇప్పుడు జరుగుతున్న విషయం బయటకు చెప్పడంపై భయంగా ఉంది. అయితే ఏమీ చేయ కుండా కూర్చోలేను. ఇదే సమయంలో నా భద్రత కోసం జాగ్రత్తపడాలి’’ అని వ్యాఖ్యానించారు. హక్కులు కోల్పోయాం పౌర పాలనలో తాను హిజాబ్ ధరించడానికి వ్యతిరేకమని, కానీ ప్రస్తుతం తన హక్కును లాగేసుకున్నట్లు అనిపిస్తోందని ముర్సల్ చెప్పారు. షరియా చట్టం అమలైతే తాము స్వేచ్ఛగా సంచరించే వీలుండదని, ఇంట్లోనే ఉండాలని, బయటకు వస్తే ముసుగుతో పాటు ఎవరో ఒక మగవారు తమవెంట ఉండాలని, అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని వాపోయారు. ఎక్కడికైనా పోదామంటే సరిహద్దులు మూసివేశారన్నారు. తాను ఇస్లాంకు వ్యతిరేకం కాదని, కానీ స్త్రీలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, పాడడంలో తప్పులేదన్నది తన అభిప్రాయమన్నారు. తనకు సైతం ఇదే అనుభవం ఎదురైందని మరో జర్నలిస్టు ఖదీజా చెప్పారు. తాలిబన్లు నియమించిన డైరెక్టర్‌తో మాట్లాడితే కార్యక్రమాలన్నీ మార్చివేశామని, ఇకపై మహిళా జర్నలిస్టులు, యాంకర్లు అవసరం లేదని చెప్పారని ఖదీజా తెలిపారు. మహిళా రాజకీయవేత్త సలీమా మజారీని తాలిబన్లు బంధించి ఉంటారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈమె తాలిబన్లను తీవ్రంగా విమర్శించేవారు. భయంలో మహిళా క్రీడాకారులు తోటివారిని కాపాడమని ‘ఫిఫా’కు కెప్టెన్ విజ్ఞప్తి అఫ్గానిస్తాన్‌లో ఉన్న తన బృంద సభ్యులను రక్షించాలని ఆదేశ మహిళా ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ షబ్నం మొబరెజ్ ఫిఫా(ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య)కు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. కానీ తన టీమ్ మెంబర్స్ అఫ్గాన్‌లోనే ఉన్నారని, వారి భవితవ్యంపై భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో ఉన్న తన సహచరురాలితో జరిపిన సంభాషణను ఆమె బయటపెట్టారు. వారి పరిస్థితి బాగాలేదని, వారంతా భయంలో ఉన్నారని, ఫిఫా వారిని కాపాడాలని కోరారు. ఫుట్‌బాల్ ఆడినందుకు వారి అడ్రసులు వెతుక్కుంటూ వెళ్లి తాలిబన్లు చంపేస్తారని ఆందోళనగా ఉందన్నారు. పౌర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2007లో అఫ్గాన్ మహిళా ఫుట్‌బాల్ టీమ్ ఏర్పాటైంది. 2012లో ఖతార్‌పై గెలుపుతో ఈ టీమ్ తొలి విజయం నమోదు చేసింది. తాలిబన్ల పాలన వచ్చిన నేపథ్యంలో మహిళా క్రీడాకారులు తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయాలని, ఇంట్లో ఉన్న ప్రాక్టీస్ కిట్స్‌ను తగలబెట్టి జాగ్రత్త వహించాలని ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ ఖలీదా పోపల్ సూచించడం మహిళా క్రీడాకారుల్లో భయానికి అద్దం పడుతోంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
రైల్వే కాంట్రాక్టర్‌పై టీడీపీ నేత జులుం
∙కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని బెదిరింపులు ∙దుప్పటి పంచాయితీ చేసిన పోలీసులు గుంతకల్లు:గుంతకల్లు రైల్వే డివిజన్లోని ధర్మవరం రైల్వే రన్నింగ్ రూం నిర్వహణ కోసం గత నెల 27న టెండర్ల ప్రక్రియ ముగిసింది. రూ.1.24 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును రైల్వే శాఖ నిర్ణయించిన ధర కంటే 8 శాతం తక్కువకు కోట్ చేసి ఎస్కే ఎంటర్ ప్రైజెస్ కంపెనీ దక్కించుకుంది. ఇదే కాంట్రాక్టుకు పోటీపడిన ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ అనుచరుడు నరేంద్ర 35 శాతం ఎక్కువ ధరకు టెండర్ కోట్ చేశాడు. సహజంగా 8 శాతం తక్కువకు కోట్ చేసిన ఎస్కే ఎంటర్‌ప్రైజెస్‌కు ధర్మవరం కాంట్రాక్ట్ దక్కింది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత ఎస్కే అహ్మద్ సోమవారం డీఆర్ఎం కార్యాలయానికి వచ్చారు. అధికారులను కలిసి రన్నింగ్ రూం నిర్వహణ పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంపై చర్చిస్తున్నారు. అయితే అనుచరులతో అక్కడికి చేరుకున్న నరేంద్ర రైల్వే కార్యాలయంలోనే ఎస్కే అహ్మద్‌పై విరుచుకుపడ్డాడు. కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని, అధికారం తమ చేతుల్లో ఉందనే విషయం మరవద్దని బెదిరించాడు. టీడీపీ నేత హల్చల్ చేస్తున్న సమయంలో సీనులోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇరుపక్షాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నరేంద్ర చౌదరి బెదిరింపులపై ఎస్కే అహ్మద్ వన్‌టౌన్ ఎస్ఐ నగేష్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు దేశం నేత దౌర్జన్యంపై కేసు నమోదు చేయకపోగా సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చారు. మొత్తానికి దుప్పటి పంచాయితీతో ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. ఈ ఘటన కు సంబంధించి పంచాయతీ వ్యవహారాన్ని ధర్మవరంలోనే తేల్చుకుంటామంటూ నరేంద్ర వెళ్లిపోగా, రాజకీయలకు భయపడే ప్రసక్తే లేదని ఎస్కే అహ్మద్ కూడా వెనుతిరిగాడు. ఇదే విషయమై టీడీపీ నేత నరేంద్ర పోలీసులకు వివరిస్తూ తాను బెదిరింపులకు పాల్పడలేదన్నారు. కాంట్రాక్ట్ పనిని తనకు ఇస్తానన్న ఎస్కే అహ్మద్ రూ.2 లక్షలు గుడ్‌విల్ డిమాండ్ చేశాడన్నారు. ఇప్పటికే అతడికి రూ.లక్ష నగదు ముట్టజెప్పానని, డబ్బు తీసుకుని కూడా తనపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడంటూ ఎస్కే అహ్మద్‌పై ఆరోపించాడు. అయితే అలాంటిదేంలేదని కాంట్రాక్టర్ ఎస్కే అహ్మద్ కొట్టిపారేశారు. -
టీఆర్ఎస్ ది దౌర్జన్యమే
♦ పేదలను రోడ్డున పడేస్తారా.. సమగ్ర సర్వేకు విలువలేదా..? ♦ జవహర్‌నగర్‌లో వార్డుసభ్యులు చేస్తున్న దీక్ష న్యాయమైందే.. ♦ ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తాం ♦ మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి జవహర్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతూ పేదల ఇళ్లపై జులుం చేస్తుందని మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. జవహర్‌నగర్‌లో అన్ని కాలనీలను గ్రామకంఠంగా గుర్తించి ఇంటిపన్నులు తీసుకోవడాన్ని నిరసిస్తూ వార్డు సభ్యులు చేపట్టిన దీక్ష గురువారానికి 11వ రోజుకు చేరింది. గురువారం వార్డు సభ్యుల దీక్షకు ఎంపీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ప్రజ లకు అక్కడే పక్కా ఇళ్లను నిర్మించి మౌలి క సదుపాయాలను కల్పిస్తామని ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు చేస్తూ నే రెవెన్యూ అధికారుల చేత పేదల గూళ్ల ను కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ ఉద్యమపార్టీ అని ఓట్లు వేసి అధికారాన్ని కట్టబెడితే గద్దెనెక్కిన తర్వా త ఆ ప్రజలనే రోడ్డునపడేయడం వారి నిరంకుశ పాలనకు అద్దం పడుతుందన్నారు. 1995లో ఏర్పాటు చేసిన గ్రామకంఠం గెజిట్‌ను సడలించి ప్రస్తుత జనా భా ప్రాతిపదికన అన్ని కాలనీలను పరిగణనలోకి తీసుకుని గ్రామకంఠం ఏర్పా టు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకె ళ్తామన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పేదల విషయంలో ఆలోచన చేసి వారి ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు సహకరించాలని అ న్నారు. జవహర్‌నగర్ ప్రజలకు న్యా యం జరిగేవరకు టీడీపీ అండగా ఉండి పోరాడుతుందన్నారు. టీడీపీ మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షుడు తోటకూర జంగయ్య మాట్లాడుతూ ఎవరు ఎక్కడ గుడిసె వేసుకుంటే అక్కడే పట్టాలిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం. జీఓ 58,59 పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వెంటనే జవహర్‌నగర్‌లో దీక్ష చేస్తున్న వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మేడ్చల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, శామీర్‌పేట మండ ల అధ్యక్షుడు నాలిక యాదగిరి, జవహర్‌నగర్ అధ్యక్షుడు కుతాడి రవీందర్, నాయకులు చెన్నాపురం యాదయ్య, వేణు ముదిరాజ్, ఎల్వీ రమణ, సురేష్, త్యాగి, తిరుమల్‌రెడ్డి, శ్రీను, కిట్టు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.