హైదరాబాద్‌లో ఆర్బ్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
⇒ ఆర్బ్కామ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్
⇒ ఈవీపీ క్రెయిగ్ మెలోన్
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సొల్యూషన్స్ అంది స్తున్న ఆర్బ్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. సంస్థకు ఇది అతి పెద్ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్. ప్రస్తుతం 100 మంది దాకా పనిచేస్తున్నారు. వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలపర్లు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు ఈ కేంద్రం నుంచి పనిచేస్తారని ఆర్బ్కామ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఈవీపీ క్రెయిగ్ మెలోన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్ కంపెనీలకు సేవలను విస్తరిస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ప్రస్తుతం ట్రాకింగ్ ఉపకరణాలను జర్మనీ, మెక్సికోలో తయారు చేస్తున్నట్టు వివరిం చారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రక్కులు, నౌకలు, వాహనాలు, ఇతర పరిశ్రమల్లో 17.2 లక్షల ఐవోటీ ఉపకరణాలు బిగించామని తెలిపారు. వీటన్నిటినీ అనుసంధానిస్తూ కస్టమర్ కేర్ సేవలు అందిస్తున్న ఉత్తర అమెరికా టీమ్‌కు హైదరాబాద్ బృందం తోడ్పాటు అందిస్తుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి పంజా వెల్లడించారు. ఐవోటీ కంపెనీలు తయారీ కేంద్రాలను నెలకొల్పితే ఐటీ సంస్థలకు ఇచ్చే ప్రయోజనాలను కల్పిస్తామని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.