అనాధాశ్రమం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
విజయవాడ: అనాధాశ్రమంలో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన నగరంలోన కలకలం సృష్టిస్తోంది. స్థానిక గురునానక్ కాలనీలోని పవిత్రాత్మానికేతన్ అనాధాశ్రమంలో ఉంటున్న రోహిణి(13), మరియమ్మ(11) అనే ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారంటూ ఆశ్రమ నిర్వాహకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పటమట పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.