పోస్టల్ పిన్‌కోడ్ కోసం ఖైదీ ఆర్టీఐ దరఖాస్తు
న్యూఢిల్లీ: పోస్టల్ పిన్‌కోడ్ కోసం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా దరఖాస్తు చేసుకున్నాడో పేద ఖైదీ. మహారాష్ట్ర కొల్హాపూర్ జైలులో ఉన్న ఖైదీ జితేంత్ర ఆనందరావ్ చౌహాన్ తన ఇంటికి ఉత్తరాలు పంపడానికి పోస్టల్ పిన్‌కోడ్ అవసరమైంది. కేంద్ర సమాచార కమిషన్ వెబ్సైట్లో పిన్‌కోడ్ సమాచారం లేకపోవడంతో ఆర్టీఐకింద దరఖాస్తు చేసుకున్నాడు. స్పందించిన కేంద్ర సమాచార కమిషనర్ బసంత్ సేత్ పిన్కోడ్లు ఉన్న నకలు ఒకటి అతనికి ఉచితంగా ఇవ్వాలని తపాలా శాఖను ఆదేశించారు.
అయితే ఖైదీగా ఉన్న చౌహాన్‌కు నేరుగా సమాచారం అందించడం కుదరదని, అతను ఇంటర్నెంట్ నుంచే పొందాలని తపాలా అధికారులు పేర్కొన్నారు. చౌతాలతో సహా ఈ జైలులో చాలా మంది ఖైదీలు తమ ఇళ్లకు పంపిన ఉత్తరాలు సరైన పిన్కోడ్లేని కారణంగా తిరిగి వచ్చాయి. వీరితోపాటు దేశంలోని వివిధ జైళ్లలో ఖైదీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సమాచార క మిషనర్ బసంత్ సేత్ తపాలా శాఖకు సూచించారు.