ఇదేం న్యాయం బాబూ..!
జూలై14వ తేదీ రాత్రి... రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్నాయంటూ జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహాలను అధికారులు తొలగించారు.
ఆగస్టు 1వ తేదీ ఉదయం... టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆపార్టీ కార్యకర్తలు ప్రతిష్ఠించి, ఆవిష్కరించారు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.
మండల కేంద్రమైన అమరావతి మద్దూరు డౌన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలను చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. విశేషమేమంటే.. ఎలాంటి అనుమతులు లేకుండా తెలుగు తమ్ముళ్లు శనివారం రాత్రి దిమ్మె కట్టిస్తున్నారని అధికారులకు వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సోమవారం ఉదయం హడావిడిగా టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేపట్టారు. దీంతో తమవారికో న్యాయం... ఇతరులకో న్యాయం.. అంటూ వాపోతున్నారు. ప్రజానీకం ఇదేం పాలన ‘బాబూ?’ అని ప్రశ్నిస్తున్నారు.
– అమరావతి