టర్కీ సంచలన నిర్ణయం
అంకారా : పెళ్లి వేడుకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టర్కీ సంచలన నిర్ణయం తీసుకుంది. హంగు ఆర్భాటాలతో బయట జరిగే వేడుకలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. భద్రతా కారణాల కోసం బహిరంగ వివాహాలను రద్దు చేస్తున్నట్టు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా చర్యలు.. టర్కీ వ్యాప్తంగా బహిరంగంగా వివాహాలు, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది. ఇండోర్ వివాహాలు నిర్వహించే వారుకూడా ముందస్తుగా అధికారులకు తెలుపాలని, భద్రతా దళాలు తాము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
టర్కీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పాటించని వారిపై దుష్ప్రవర్తన చట్టం కింద జరిమానా విధించనున్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో గేసియెంట్ప్ నగరంలో జరిగే స్ట్రీట్ వెడ్డింగ్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. ఆ దాడిలో 34 చిన్నారులతో పాటు 56 మంది మృతిచెందగా., 100 మంది గాయాలు పాలయ్యారు. ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఇస్తామిక్ స్టేట్(ఐఎస్) హస్తమున్నట్టు అధికారులు పేర్కొన్నారు.