రైల్వేస్టేషన్లలో అంబులెన్స్‌ల సౌకర్యం
సాక్షి, ముంబై : వర్షాల వల్ల ఫుట్‌పాత్‌లపై జారిపడి గాయాలైన వారి కోసం వెస్టర్న్, సెంట్రల్ రైల్వేలు అంబులెన్సులను అందుబాటులో ఉంచాయి. ఓవర్‌హెడ్ బ్రిడ్జిల వద్ద మెట్లు ఎక్కి దిగే సమయంలో ప్రయాణికులు పలు మార్లు జారి కిందపడి తీవ్ర గాయాలైన సందర్భాలు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం వెస్టర్న్ లైన్ అయిన చర్చ్‌గేట్ నుంచి అంధేరి-బోరివలి, దాదర్, బాంద్రాలో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.
సెంట్రల్లైన్లో మాటుంగ, సీఎస్టీ, ఘాట్కోపర్, కుర్లా వర కూ అంబులెన్సుల సౌకర్యం కల్పించారు.రైల్వే స్టేషన్లలో గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అం దజేయడంతోపాటు, తక్షణమే ఆస్పత్రులకు కూడా తరలించడానికి ఏర్పాట్లు చేసింది. చిన్న గాయాలకు ప్రథమ చికిత్స అందజేస్తామని, పెద్ద గాయాలైతే సమీప ఆస్పత్రులకు తరలిస్తామని అంబులెన్స్ డ్రైవర్ పేర్కొన్నాడు.