యోగాలో ఓవరాల్ చాంపియన్ కరీంనగర్
హ్యాట్రిక్ కైవసం చేసుకున్న జిల్లా జట్టు
కరీంనగర్ స్పోర్ట్స్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఈనెల 8 నుంచి 10వరకు జరిగిన రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మూడు బంగారు, ఐదు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించి 23పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నారు. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి జిల్లా జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను అందించారు.
పతకాలు సాధించిన క్రీడాకారులు
బంగారు పతకాలు: పూజ(దూమాల), సమత(జగిత్యాల), ఆనంద్ కిశోర్(కరీంనగర్)
రజత పతకాలు: రాకేశ్(రుక్మాపూర్), ప్రేమలత(దూమాల), వీణ(సుల్తానాబాద్), దేవయ్య (గంభీరావుపేట), రాజు
కాంస్య పతకాలు: వెంకటేశ్(మానకొండూర్), సృజన్ (పూడూరు), రవీనా (దూమాల), మల్లేశ్వరీ (కరీంనగర్)