సరిహద్దుల్లో పాక్ కాల్పులు
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మళ్లీ కాల్పులకు దిగింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్ ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలోని 15 భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. శనివారం రాత్రంతా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారని వెల్లడించారు.
ఇటీవల పాక్ వరుసగా కాల్పులకు దిగుతున్న సంగతి తెలిసిందే. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాక్ దాడులను భారత్ సైన్యం దీటుగా ఎదుర్కొంటోంది.