Oxygen Movie
-
టాలీవుడ్ సినీ దిగ్గజం చంద్రమోహన్ చివరి సినిమా ఇదే!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. మరో సినీ దిగ్గజం నింగికెగిసింది. తన వైవిధ్యమైన నటనతో సినీ అభిమానులను అలరించిన సీనియర్ నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సినీనటులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 1966లొ రంగుల రాట్నంతో ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్.. దశాబ్దాల పాటు తన కెరీర్లో వందల చిత్రాల్లో నటించారు. హీరోగా, నటుడిగా, విభిన్నమైన పాత్రల్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో మెప్పించారు. అలనాటి స్టార్ హీరోయిన్స్, శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారితో సినిమాలు చేశారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో చంద్రమోహన్ కనిపించారు. చంద్రమోహన్ తెలుగుతో పాటు తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. -
గోపిచంద్ ‘పంతం’ ఫస్ట్ లుక్
కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న మాస్ హీరో గోపిచంద్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పంతం. గోపిచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీ, జయప్రకాష్ రెడ్డిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్ సాధించి తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు గోపిచంద్. -
1040 సినిమాల్లో నటించా..
సినీ హాస్యనటుడు ఆలీ సీతానగరం : ఇప్పటివరకూ తాను 1,040 సినిమాల్లో నటించినట్టు సినీ హాస్య నటుడు ఆలీ అన్నారు. చినకొండేపూడిలో ‘ఆక్సిజన్’ సినిమా షూటింగ్కు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏఎం రత్నం కుమారుడు తీస్తున్న ‘ఆక్సిజన్’ సినిమా పేరు మార్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తీస్తున్న సర్దార్, సాయిధరమ్తేజ్ హీరోగా తిక్క, ఊపిరి, రన్, నారా రోహిత్ హీరోగా తుంటరి, ఒక అమ్మాయి తప్పా సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ భూములు కేటాయిస్తున్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విశాఖలో సినీ పరిశ్రమకు భూములు కేటాయించే అవకాశం ఉందని అన్నారు. టాలీవుడ్లో సినిమాలు రూ.70 కోట్లు, రూ.80 కోట్లు వసూలు చేస్తున్నాయని, ఇండస్ట్రీ చాలా బాగుందని తెలిపారు. తనకు నచ్చిన ప్రదేశం రాజమహేంద్రవరమని, అలాగే చెన్నై, విదేశాల్లో స్విట్జర్ల్యాండ్ ఇష్టమని చెప్పారు. త్వరలో తాను హీరోగా ఓ సినిమాలో నటించబోతున్నట్లు ఆలీ తెలిపారు.