oylimpics
-
Milkha Singh: శరణార్థి శిబిరం నుంచి ఒలింపిక్స్.. వయా తీహార్ జైలు!
ఒలంపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పరుగు పందేలతో, పతకాలతో దేశ ప్రతిష్టను పెంచిన దిగ్గజం మిల్కా సింగ్. పోస్ట్ కొవిడ్ సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల వయసున్న ఆయన కన్నుమూయగా.. క్రీడా లోకం, దేశం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది. అయితే ఈ పరుగుల దిగ్గజం గురించి అతితక్కువ మందికి తెలిసిన విషయాలెంటో చూద్దాం. 1929 నవంబర్ 20న గోవింద్‌పుర(ప్రస్తుతం పాక్‌లో ఉన్న పంజాబ్)లో పుట్టిన మిల్కా సింగ్.. విభజన అల్లర్లలో తల్లిదండ్రుల్ని పొగొట్టుకున్నాడు. బలవంతంగా శరణార్థ శిబిరాల్లో గడిపిన మిల్కా.. చివరికి 1947లో ఢిల్లీలో ఉంటున్న తన సొదరి దగ్గరికి చేరుకున్నాడు. ఆ టైంలో టికెట్ లేకుండా ప్రయాణించిన నేరానికి కొన్నాళ్లు తీహార్ జైలులోనూ గడిపాడాయన. అల్లర్లలో తల్లిదండ్రుల్ని కోల్పోవడం, చేదు అనుభవాలు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని, ఒకానొక టైంలో దొపిడీ దొంగగా మారాలని అనుకున్నాడని ఆయన తరచూ ఇంటర్వ్యూలలో చెప్తుండేవాడు. అయితే సోదరుడి ప్రోత్సాహంతో ఆర్మీలో చేరి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ‘పరుగులు’ తీశాడు ఇండియన్ ఆర్మీ పరీక్షల్లో మూడుసార్లు విఫలమైన మిల్కా సింగ్.. 1951 నాలుగో అటెంప్ట్‌లో సెలక్ట్ అయ్యాడు. ఆర్మీలో టెక్నికల్ జవాన్‌గా మిల్కా సింగ్ ప్రస్థానం మొదలైంది. అయితే అక్కడి నుంచే ఆయన రన్నింగ్ రేసుల్లో పాల్గొనేవాడు. మన దేశంలో రన్నింగ్‌లో ‘ట్రాక్ అండ్ ఫీల్డ్’ను ఇంట్రడ్యూస్ చేసింది మిల్కా సింగే. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత.. తన విజయానికి గౌరవంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించాలన్న మిల్కా సింగ్ విజ్ఞప్తిని అప్పటి ప్రధాని నెహ్రూ సంతోషంగా అంగీకరించారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో నాలుగో స్థానంలో నిలిచాడు మిల్కా సింగ్. అయితే అప్పుడు ఆయన నెలకొల్నిన 45 సెకన్ల రికార్డు బ్రేక్ చేయడానికి మరో భారత రన్నర్‌కి 40 ఏళ్లు పట్టింది. ఆసియా పరుగుల వీరుడి ట్యాగ్ దక్కించుకున్న అబ్దుల్ ఖలిక్‌పై 200 మీటర్లపరుగుపందెంలో విజయం సాధించాడు మిల్కా సింగ్. అది చూసి పాక్ జనరల్ ఆయూబ్ ఖాన్ ‘ఫ్లైయింగ్ సిక్’ అని పిలిచాడు. అప్పటి నుంచి అది ఆయన బిరుదు అయ్యింది. మొత్తం 80 రేసుల్లో 77 విజయాలతో అరుదైన రికార్డు ఆయన సొంతమని చెప్తారు. 2001లో కేంద్రం ఆయనకు అర్జున అవార్డు ప్రకటించగా.. ‘40 ఏళ్లు ఆలస్యమైంద’ని పేర్కొంటూ ఆయన తిరస్కరించారు. ఆయన తన పతకాలన్నింటిని దేశానికే దానం చేశాడు. తొలుత ఢిల్లీ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన వాటిని.. తర్వాత పటియాలాలోని స్పోర్ట్స్ మ్యూజియానికి తరలించారు. 1999లో కార్గిల్ వార్‌లో అమరుడైన బిక్రమ్ సింగ్ ఏడేళ్ల కొడుకును మిల్కా సింగ్ దత్తత తీసుకున్నాడు మిల్కా సింగ్ తన కూతురు సోనియా సాన్వాకాతో కలిసి ఆత్మకథ ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ రాసుకున్నాడు. ఈ బుక్ ఆధారంగానే బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ మెహ్రా, ఫర్హాన్ అక్తర్‌ను లీడ్ రోల్ పెట్టి ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమా తీశాడు. అయితే ఈ సినిమా కోసం తన బయోపిక్ హక్కుల్ని ఒక్క రూపాయికే ఇచ్చేసి ఆశ్చర్యపరిచాడు ఈ దిగ్గజం. కానీ, సినిమాకొచ్చే లాభాల్లో కొంత వాటాను పేద క్రీడాకారుల కోసం నెలకొల్పిన మిల్కా సింగ్ ఛారిటబుల్ ట్రస్ట్‌కి ఇవ్వాలనే కండిషన్ పెట్టాడనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ కన్నుమూత -
క్రీడా‘కుసుమ’ం
–ప్రోత్సాహం ఉంటే ఒలింపిక్స్‌కు వీరవాసరం : గ్రామీణ ప్రాంతం నుంచి అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏపీ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికైంది రావాడ కుసుమ. వీరవాసరం గ్రామానికి చెందిన కుసుమ పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పాల్గొన్న ప్రతీ పోటీలోను పతకాలను చేతబడుతుంది. 2009 ఆగస్ట్ 16న అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏపీ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికైంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఇంటిర్మిడియట్ మొదటి సంవత్సరం చదువుతూ క్రీడల్లోనూ రాణిస్తుంది. లాంగ్‌జంప్, హార్డిల్స్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ మేటి క్రీడాకారిణిగా గుర్తింపుతెచ్చుకుంటుంది. తల్లి ప్రోత్సాహంతో ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే కుసుమ తండ్రి రావాడ అప్పారావు ఐదేళ్ల్ల క్రితం అనారోగ్యంతో మతి చెందాడు. కుసుమ అప్పుడు 7వ తరగతి చదువుతోంది. తల్లి దుర్గా ఆదిలక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమార్తె, కుమారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెంచుతోంది. సాధించిన పతకాలు క్రీడాకారిణిగా రావాడ కుసుమ ఎన్నో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి 100కు పైగా పతకాలను సొంతం చేసుకుంది. 2013లో శ్రీకాకుళంలో జరిగిన 59వ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ను, 2015లో కాకినాడలో జరిగిన 27వ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌ను, 2016లో కోజికోడ్ (కేరళ)లో జరిగిన 61వ జాతీయ స్కూల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో రజత పతకం సాధించింది. ఇవే కాకుండా వికారాబాద్, రంగారెడ్డి, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఇంటర్ డ్రిస్టిక్ట్స్ స్కూల్ గేమ్స్ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హార్డీల్స్లో ఎన్నో పతకాలు, ప్రశంసా పత్రాలను అందుకుంది. –ఒలింపిక్స్‌లో పతకం నా లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. అథ్లెటిక్స్ కోచ్ ఆదిత్యవర్మ పర్యవేక్షణలో వివిధ పోటీల్లో రాణిస్తున్నాను. నా తల్లి దుర్గాఆదిలక్ష్మి నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ప్రోత్సాహం ఉంటే ఇంకా రాణించి దేశానికి ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. –ప్రోత్సాహం ఉంటే మరింత రాణిస్తుంది నా కుమార్తె కుసుమకు ప్రోత్సాహం ఉంటే క్రీడల్లో మరింత రాణిస్తుంది. కూలీ నాలీ చేసుకుని జీవనం సాగించే నాబోటి వాళ్లు మెరుగైన శిక్షణ ఇప్పించడం ఆర్థికంగా కష్టతరం. ప్రస్తుతం స్పోర్ట్స్ స్కూల్లో చదువుతుంది. ఇంటిర్మీడియట్ అనంతరం డిగ్రీ చదువును బయటే చదవాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నాపై పెనుభారం పడుతుంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది.