క్షీణిస్తున్న శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రారెడ్డి ఆరోగ్యం ఏడవ రోజుకు చేరిన దీక్షలు
వైఎస్ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఆదివారానికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం దీక్ష చేస్తున్న నేతలకు వైద్యులు మరోసారి పరీక్షించనున్నారు. శనివారం సాయంత్రం శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రారెడ్డి, ఇతర నేతలను పరీక్షించి.. ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పారు. అయినా దీక్షలు కొనసాగించడానికే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి నిర్ణయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నేతల చేపట్టిన దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు, అన్ని వర్గాల వారు తరలివచ్చి వీరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
మాజీ మంత్రులు వైఎస్ వివేకానందరెడ్డి, పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డిలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈసీ గంగిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డి దీక్షలు ఆదివారం నాటికి నాలుగురోజుకు చేరాయి.