దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : మహిళను బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠా ను భీమిలి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కమిషనరేట్ సమావేశ మందిరంలో శు క్రవారం విలేకరుల సమావేశంలో నగ ర శాంతి భద్రతలు డీసీపీ పి.విశ్వప్రసాద్ వివరాలను వెలడించారు. పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని అట్టాడ జయప్రద గత నెల 23వ తేదీ సాయంత్రం చీపురుపల్లిలోని తన బంధువుల ఇంట్లో వివాహానికి బయల్దేరారు.
మహారాజుపేట జంక్షన్లో నగిశెట్టి పెద్దిరాజు(29) ఆటో విజయనగరం వెళ్తుందని చెప్పడంతో ఎక్కారు. అందులో గండిరెడ్డి గోవిందరాజు (23), నగిశెట్టి శివ (26), ధర్లామి మోహన్(20), ధాట్ల పైడిరాజు (21) ఉన్నారు. ఆటో కొంతదూరం వెళ్లాక రూటు మారటాన్ని ఆమె గమనించి ప్రశ్నించారు. వారు కత్తితో బెదిరించి మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండ, సెల్‌ఫోను, ఎస్బీఐ ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు, ఐడెంటిటీ కార్డుతో సహా హ్యాండ్‌బ్యాగ్ లాక్కొన్నారు.
అనంతరం ఆమెను చీరతో కట్టేసి వెళ్లిపోయూరు. తప్పించుకున్న ఆమె దగ్గరల్లోని బంధువుల ఇంటికి చేరుకుని విషయూన్ని కుటుం బసభ్యులకు సమాచారం అందించారు. వారు భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆటోడ్రైవర్ నగిశెట్టి పెద్దిరాజును ఆనందపురం ఎస్సీ కాలనీలోను. మిగిలిన నలుగురిని నగరంపాలెంలోని ఓ హోటల్లో సీఐ ఎస్.లక్ష్మణమూర్తి, ఎస్ఐ వై.అప్పారావు ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దోపిడీకి వినియోగించిన ఆటోతోపాటు అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.