బోపన్న జంట పరాజయం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. జొకోవిచ్–విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) జంటతో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న జోడీ 6–2, 3–6, 7–10 తేడాతో ఓడిపోయింది. చెరో సెట్ గెల్చుకున్నాక నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న జంట 4–2తో ఆధిక్యంలోకి వెళ్లినా చివరికి 7–10తో ఓటమి పాలైంది.