దేశంలోనే కర్ణాటక పోలీస్ ఉత్తమం
రాష్ట్ర డీజీపీ లాల్రుకుమ్పచావ్
బెంగళూరు(బనశంకరి) : దేశంలోనే కర్ణాటక పోలీస్ ఉత్తమమని డీజీపీ లాల్రుకుమ్ పచావ్ ప్రశంసించారు. శనివారం ఆయన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా శుక్రవారం కోరమంగలలోని కేఎస్ఆరపీ మైదానంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించి మాట్లాడారు.
తన అధికారంలో రాష్ర్టంలో పలు తీవ్ర సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొన్నానని అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో రెండు ప్రాంతాల్లో పేలుడు ఘటనలు జరిగాయని ఈ కేసుల్లో నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో రాష్ర్ట పోలీస్ శాఖ చాకచక్యంగా వ్యవహరించిందంటూ అభినందించారు.