హాస్టింగ్స్ స్థానంలో టెయిట్
న్యూఢిల్లీ: చీలమండ గాయంతో బాధపడుతున్న పేసర్ జాన్ హాస్టింగ్స్ స్థానంలో ఆసీస్ బౌలర్ షాన్ టెయిట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తీసుకుంది. మిగతా ఐపీఎల్ సీజన్‌కు అతను అందుబాటులో ఉంటాడని ఫ్రాంచైజీ తెలిపింది. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో టెయిట్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
అయితే ఇప్పుడు కేకేఆర్ తరఫున అవకాశం రావడంతో సహచరులు క్రిస్ లిన్, బ్రాడ్ హాగ్‌తో కలిసి అతను బరిలోకి దిగనున్నాడు. ‘కేకేఆర్ కుటుంబంలోకి టెయిట్‌ను సాధారంగా ఆహ్వానిస్తున్నాం’ అని ఫ్రాంచైజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.