మోటార్‌సైకిల్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
పాలకొల్లు సెంట్రల్ : మోటార్ సైకిల్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘట న పాలకొల్లులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ంలోని మారుతి సెంటర్ అచ్చుగట్లపాలెంలో నివాసముం టున్న కాకుల శివాజీ (60) బుధవారం స్థానిక రైల్వేగేటు గూడ్స్ రోడ్డు నుంచి నడిచి వెళ్తుండగా మోటార్ సైకిల్‌పై వస్తున్న సిర్రా వెంకటరత్నం ఢీకొట్టాడు. దీంతో శివాజీ తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శివాజీ పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరత్నంపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు. గురువారం మృతదేహానికి పంచనామా చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడు శివాజీ వివరాలను ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అతని కుమారుడు అనిల్‌ను ఓదార్చి సానుభూతిని వ్యక్తం చే శారు.