అరబిక్‌లో మాట్లాడారని విమానం దించేశారు
న్యూయార్క్: పారిస్ ఘటనతో అమెరికాలో ముస్లింలను చూస్తేనే భయపడతున్నారు. చికాగో విమానాశ్రయంలో అరబిక్ భాషలో మాట్లాడిన ఇద్దరు పాలస్తీనా జాతీయులు విమానం ఎక్కకుండా విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. వీరిద్దరూ పదిహేనేళ్ల క్రితమే పాలస్తీనా నుంచి వచ్చి ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డారు. వీరిలో మిఠాయిల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి వద్ద తెలుపురంగు బాక్సుందని ప్రయాణికులు తెలపటంతో విచారించిన పోలీసులు ఆ బాక్స్‌ను తెరిపించి ఏమీ లేదని తేలాక వీరిద్దరినీ వేరే విమానంలో పంపించారు.
మరో ఘటనలో, చికాగో నుంచి హ్యూస్టన్ వెళుతున్న మరో విమానంలో ఉన్న ఆరుగురు ముస్లింలతో కలిసి ప్రయాణించేందుకు తోటి ప్రయాణికులు ఒప్పుకోలేదు. దీంతో ఈ ఆరుగురిని దించేసి వేరే విమానంలో పంపించారు.