హత్యాయత్నం కేసులో యువతికి ఐదేళ్ల జైలు
బంజారాహిల్స్ : తాను ప్రేమిస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంటుందన్న అక్కసుతో ఓ యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితురాలికి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన పల్లకొండ మమత(27), వర్ధన్నపేట మండలం ఐలోను గ్రామానికి చెందిన పల్లకొండ దివ్యశ్రీ(23) సమీప బంధువులు. వరంగల్‌లో బీఫార్మసీ చ దువుతుండగా దివ్యశ్రీకి 2013 మార్చి 9న వరంగల్‌కు చెందిన మేనబావ రామాపురం కుమార్‌తో నిశ్చితార్ధం జరిగింది. అదే ఏడాది జూన్ 13న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే అప్పటికే కుమార్‌ను ప్రేమిస్తున్న మమత అతడికి దివ్యశ్రీతో పెళ్లి జరుగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోయింది.
దివ్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ఇందులో భాగంగానే కుమార్ ప్రవర్తన మంచిదికాదని, ఓ అమ్మాయిని ప్రేమించిన అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని, తాళిబొట్టు కొనమని తననే పురమాయించాడని చెప్పింది. తనతో హైదరాబాద్‌కు వస్తే నీకే ఈ విషయం తెలుస్తుందని చెప్పి 2013 మే 4న బలవంతంగా రెలైక్కించింది. సాయంత్రం రైలు దిగి నేరుగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే తన సోదరి స్వరూప ఇంటికి తీసుకొచ్చింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటూ బెడ్రూంలోకి తీసుకెళ్లి కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా పొడిచింది. తాను ప్రేమిస్తున్న కుమార్‌ను నువ్వు పెళ్లి చేసుకుంటావా...? నిన్ను చంపేస్తాను....కుమార్‌ను నీకు దక్కనివ్వనంటూ గాట్లు పెట్టింది.
దివ్య రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా మమత బయట నుంచి తాళం వేసింది. విషయాన్ని దివ్యశ్రీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా కాబోయే భర్త కుమార్‌కు, తండ్రి సారయ్యకు తెలపగా ఇక్కడే ఉంటున్న తమ బంధువులను ఘటనా స్థలానికి పంపించగా వారు దివ్యశ్రీని ఆస్పత్రికి తరలించారు. మెడ, ఎద, పెదవులతోపాటు తొమ్మిది చోట్ల కత్తిగాట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దివ్యను అంధవికారంగా చేయడం, కుదరకపోతే హత్య చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న మమతపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 307కింద కేసు నమోదు చేసి అరెస్ ్టచేసి రిమాండ్‌కు తరలించారు. పక్కా ఆధారాలు సమర్పించడంతో నిందితురాలు మమతకు సెషన్స్ జడ్జి రజని జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.