మల్లన్నసాగర్‌కు భూమిలిస్తాం
తొగుట: మల్లన్నసాగర్ నిర్మాణానికి తమ భూములిస్తామంటూ మండల పరిధిలోని పల్లె పహాడ్ గ్రామస్తులు ముందుకొచ్చారు. రాష్ట్ర మంత్రి హరీష్‌రావుతో చర్చలు జరిపేందుకు గ్రామ సర్పంచ్ కీసర సంతోష, జెడ్పీటీసీ రూప ఆధ్వర్యంలో గజ్వేల్‌కు బుధవారం తరలివెళ్లారు. మంత్రితో గ్రామస్తులు జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.