వ్యక్తి దారుణ హత్య
చలిమంట కాసుకుంటున్న వ్యక్తి పై ప్రత్యర్థి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన అదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పుష్పూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంకజ్పటేల్(26), కేబుల్ టీవీ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అదే గ్రామంలో కేబుల్ నిర్వహిస్తున్న రాజన్న అనే వ్యక్తితో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పంకజ్పటేల్ ఆదివారం రాత్రి ఇంటి ముందు చలిమంట కాసుకుంటున్న సమయంలో రాజన్న కత్తితో అతని పై దాడి చేసి హతమార్చాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.