Pankaja
-
పోలీసులను ఒక్కటే అడుగుతున్న.. వల్లభనేని వంశీ భార్య ఎమోషనల్
-
తప్పుడు కేసులతో పోలీసులు వంశీని వేధిస్తున్నారు
-
వల్లభనేని వంశీ అరెస్ట్ పై భార్య పంకజశ్రీ ఫస్ట్ రియాక్షన్
-
తపనకు తోబుట్టువులు
పంకజ విజయ రాఘవన్ వయసు 70 ఏళ్లు. విజయ శ్రీనివాసన్ వయసు 67. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. తమిళ కుటుంబాలకు చెందినవారు. పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. ఉద్యోగాల రీత్యా ముంబయ్, చెన్నై, పుణే అంటూ వెళ్లినా ఇరవై ఏళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పంకజ సికింద్రాబాద్‌లోని మల్లాపూర్‌లో, విజయ మారేడుపల్లిలో ఉంటారు. పంకజ తెలుగు, తమిళం, ఇంగ్లిషు, హిందీ అనువాదాలు చేస్తూ, టీవీ కార్యక్రమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ బిజీగా ఉంటే.. చెల్లెలు విజయ ‘రెడీ టు ఈట్’ పొడుల తయారీ, అమ్మకాలు చేపట్టి.. మలి వయసులో నిస్పృహతో గడిపే ఎందరికో స్ఫూర్తిని రగిలిస్తున్నారు. (‘ఫస్ట్ లేడీస్’లో బెస్ట్ లేడీ మార్తమ్మ) వాయిస్ ఇంత పంచి ‘‘పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా ముంబయ్, చెన్నైలో ఉన్నాను. కొన్నాళ్లు ఐటీ ఇండస్ట్రీలో పని చేశాను. ఇద్దరు అబ్బాయిలు. వాళ్లు సెటిల్ అయ్యారు. రిటైర్ అయిన తొలి రోజుల్లో.. ఏం చేస్తే బాగుంటుందా అని నా వయసు వారితో కూర్చుని ప్లాన్ చేసేదాన్ని’’ అంటారు పంకజ. ‘‘అప్పటికే ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుని ఉండటం వల్ల నాకు తెలిసినవాళ్లు వీడియో డైలాగ్‌కు ట్రాన్స్క్రిప్షన్ వర్క్ చేసివ్వమని అడిగారు. ఆ సమయంలోనే ‘మీ గొంతు బాగుంది, వాయిస్ ఓవర్ ఇవ్వండి’ అని అడిగారు. ఇప్పుడు ఆ వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఇంటి నుంచే బెంగుళూరు ఐఐఎంకి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) వీడియో అనువాదాలు చేసి ఇస్తున్నారు. తమిళ్ టీవీ ఛానెల్లోని కుకరీ షోకి వాయిస్ ఓవర్ చెబుతున్నారు. ఇప్పటికి 500 ఎపిసోడ్స్ వరకు ఆమె తన వాయిస్ ఇచ్చారు. ‘‘సంపాదించాలనే ఆలోచన కాదు. ఏదైనా పనిలో ఉండాలి. ఆ పనే మనల్ని చురుగ్గా ఉంచుతుంది. అందుకే మా చెల్లెలు విజయతో కలిసి ఆమె చేస్తున్న పొడుల తయారీలోనూ భాగస్వామిని అయ్యాను’’ అని చెప్పారు పంకజ. కిచెన్లలోకి ‘కంచి’ విజయ వారాంతాల్లో హైదరాబాద్‌లో జరిగే చిన్న చిన్న ఎగ్జిబిషన్లు, చేనేత సంత వంటి వాటిల్లో రుచికరమైన పొడులను వినియోగదారులకు పరిచయం చేస్తూ కనిపిస్తారు. కార్పోరేట్ ఆఫీసులోని అడ్మిన్ విభాగంలో ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు విజయ. భర్త బ్యాంకు ఉద్యోగి. ఓ కూతురు కొడుకు. పిల్లలిద్దరూ స్థిరపడ్డారు. భర్త దూరమై, తను రిటైర్ అయ్యాక కూడా ఓ ఎమ్మెన్సీలో ఏడేళ్లపాటు పనిచేశారు. ఇప్పుడు ‘కంచి కిచెన్స్’ పేరుతో సాంబార్‌పొడి, దోస పొడి, మిర్చి పొడి, పులిహోర మిక్స్.. ఇలా సంప్రదాయ రుచులను మార్కెట్ చేస్తున్నారు ‘‘రిటైర్ అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నా. చిన్న చిన్న కథలంటే చాలా ఇష్టం. అవి రాస్తూ ఉంటాను. వంట అంటే ఇంకా ఇష్టం. మా అమ్మ తన 87 ఏళ్ల వయసు వరకు మాతోనే ఉన్నారు. ఆవిడ నేర్పించిన వంటలు, బామ్మల వంటల రుచులను ఈ తరం వారికి పరిచయం చేయాలనుకున్నాం. ఇలా తయారుచేసిన ఉత్పత్తులను పెద్ద ఎగ్జిబిషన్స్‌లో, మాల్స్‌లో పెట్టాలనేది నా కల. ఈ ఫుడ్ ఐటమ్స్‌ని ఎనిమిది నెలలుగా చేస్తున్నాం. డబ్బుకు లోటు లేదు. కానీ, ఏదో చేయాలన్న తపన’’ అంటారు విజయ. తాము పనిచేస్తూనే ఆ పనిలో తమ కుటుంబసభ్యులనూ కలుపుకుంటూ మలి వయసునూ ఆహ్లాదకరంగా మార్చుకున్న ఈ అక్కాచెల్లెళ్లు చుట్టుపక్కల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. – నిర్మలారెడ్డి -
ముండే కుమార్తెల ఘన విజయం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఉప ఎన్నికలో దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తెలు పంకజ, ప్రీతమ్‌లు విజయం సాధించారు. పంకజా పర్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థిపై 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవగా ప్రీతమ్ తన తండ్రి మరణంతో ఖాళీ అయిన బీడ్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ చరిత్రలోకెల్లా రికార్డు విజయం సాధించారు. 6,96,321 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. ఆమెకు 9,22,416 ఓట్టొచ్చాయి. ఇప్పటి వరకూ ఈ రికార్డు బెంగాల్ నుంచి 2004లో 5,92,502 ఓట్ల తేడాతో గెలిచిన సీపీఎం నేత అనిల్ పేరిట ఉంది. -
ప్రజలు నేను సీఎం కావాలనుకుంటున్నారు
గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ నాగ్‌పూర్/పార్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రీ-పోల్ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఆశావహులు మనసులో మాట బయటపెడుతున్నారు. సీఎం పోస్టును తాను చేపట్టాలని ప్రజలు అనుకుంటున్నారని దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె, ఎమ్మెల్యే పంకజ చెప్పారు. ‘నా పనే నన్ను ఆ పీఠం దగ్గరికి చేరుస్తుందని ఇదివరకు చెప్పా. మా నాన్న సీఎం కావాలని జనం అనుకున్నారు. నాకు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే నేను సీఎంగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేదు’ అని ఆమె తన నియోజకవర్గమైన పార్లీలో ఓటేసిన అనంతరం చెప్పారు. -
తండ్రి చితికి నిప్పంటించిన ముండే కుమార్తె
-
తండ్రి చితికి నిప్పంటించిన ముండే కుమార్తె
బీడ్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ముగిశాయి. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం మధ్నాహ్నం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లీలో అంత్యక్రియలు నిర్వహించారు. ముండేకు కుమారులు లేకపోవడంతో ఆయన పెద్ద కుమార్తె పంకజ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అశ్రునయనాలతో తండ్రి చితికి నిప్పంటించారు. ఇక తమ అభిమాన నేతను కడసారి దర్శించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు ముండే అంత్యక్రియలకు హాజరయ్యారు. ముండేకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
ముండే తరువాత ఎవరు?
'మేం గోపీనాథ్ ముండేని మూడంటే మూడు నెలలు మాత్రం ఢిల్లీకి అప్పుగా ఇస్తున్నాం. ఆయన మళ్లీ మహారాష్ట్రకు రావలసిందే. మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కావలసిందే' అన్నారు మహారాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నిస్. ఈ ఒక్క మాట చాలు ముండే బిజెపి మహారాష్ట్ర వ్యూహంలో ఎంత ముఖ్యమైన వ్యక్తో చెప్పడానికి. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి మటుమాయమైపోతే మహారాష్ట్ర బిజెపి పరిస్థితి ఏమిటి? ముండే తరువాత ఎవరు - ఇప్పుడు మహారాష్ట్రలో బిజెపి ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. కొద్ది నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముండే చేసి వెళ్లిన ఖాళీని పూరించడం బిజెపి ముందున్న అతిపెద్ద సవాలు. ముండే చాలా విలక్షణమైన రాజకీయ నేత. ఆయనకు చాలా కోపం. రెండు సార్లు బిజెపి వదిలేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు. మోడీ, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ ల లాగా ఆయన బిజెపికి బిసి ఫేస్ ఇచ్చిన నేత. మామూలుగానైతే మహారాష్ట్ర రాజకీయాలను చెరుకు తోటల్ని, చక్కెర ఫాక్టరీలను గుప్పెట్లో పెట్టుకున్న మరాఠాలే శాసిస్తారు. శరద్ పవార్, వసంత్ దాదా పాటిల్, యశ్వతరావ్ చవాన్, శంకర్ రావ్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, విలాస్ రావ్ దేశ్ ముఖ్ ల వంటి వారందరూ మరాఠాలే. అలాంటిది బిజెపిలోకి బిసిలను తెచ్చి, లెక్కలన్నీ మార్చింది గోపీనాథ్ ముండే. ఆయన వంజారా తెగకు చెందిన వారు. ఆయన వెంట వంజారాలతో పాటు ఇతర బిసిలు నిలిచారు. రాష్టంలోని ప్రతి జిల్లాలో ఆయనకు బలం ఉంది. ఆయన ప్రభావం ఎంత ఉందంటే మామూలుగా ఎవరి మాటా వినని మోడీలాంటి సీతయ్యే ముండే చెప్పినందుకు రావూ సాహెబ్ దన్వే అనే బీసీ నేతకు కేంద్ర మంతి పదవి ఇచ్చేశారు. అసలు ఆయన బిసి, ఆయన బావ ప్రమోద్ మహాజన్ బ్రాహ్మణుడు. ఈ కృష్ణార్జునుల కాంబినేషన్ మహారాష్ట్ర బిజెపిని ఒక దశలో ఏలింది. మహాజన్ మరణం తరువాత ముండేకి కష్టాలు వచ్చాయి. ఆయన రెండు సార్లు బిజెపిని వదిలేస్తానని బెదిరించారు. ఉమాభారతి, కళ్యాణసింగ్ లు కూడా ఒకానొక దశలో పార్టీని వదిలి బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు బిజెపి ముందున్న ప్రశ్న ముండే తరువాత ఎవరు? అంత ప్రజాదరణ ఉన్న నాయకులెవరు? బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ప్రస్తుతం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నిస్ లు ఇద్దరూ బ్రాహ్మణులు, పైగా చిన్న ప్రాంతమైన విదర్భకు చెందిన వారు. మహారాష్ట్ర రాజకీయాలు మరాఠ్వాడా చుట్టూ తిరుగుతాయి. ఈ నేపథ్యంలో ముండే తరువాత ఆయన కుమార్తె పంకజ మరాఠ్వాడా నేతగా, మహారాష్ట్ర విధాతగా ఎదుగుతుందా? ఆమె ఇప్పటికే ఎమ్మెల్యే. ఈ సారి బీడ్ నియోజకవర్గంలో తండ్రి ఎన్నికల ప్రచారాన్ని ఆమే నడిపించింది. ముండే అంతిమయాత్రలో దర్శనం దక్కక చెలరేగిన అభిమానులు పంకజ చేతులు జోడించగానే చల్లబడిపోయారు. వంజారా, బీసీలతో సహా బిజెపి కింది స్థాయి కార్యకర్తలపై ఆమె పట్టు ఎంతుందో ఈ సంఘటన తెలియచేస్తుంది. అయితే కుటుంబవాదాన్ని ప్రోత్సహించని మోడీ పంకజకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? పంకజ నాయకత్వాన్ని గడ్కరీ, ఫడ్నిస్ లు ఒప్పుకుంటారా? ఎన్నికల వేళ ఒక వైపు బాల్ ఠాక్రే కుటుంబానికి చెందిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. బాల్ ఠాక్రే ఏ నాడూ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఆయన చంద్రసేనీయ కాయస్థ ప్రభు సామాజిక వర్గానికి చెందిన వారు. అది మహారాష్ట్రలో చాలా తక్కువ సంఖ్యాబలం ఉన్న కులం. అందుకే ఆయన కింగ్ మేకర్ గా ఉన్నారే తప్ప కింగ్ కాలేదు. ఇప్పుడు ఉద్ధవ్, రాజ్ లు కింగ్ లు కావాలనుకుంటున్న సమయంలో ముండే వంటి అనుభవజ్ఞుడైన ముండే ఉండి ఉంటే బిజెపి పని సానుకూలమయ్యేది. అందుకే 'ముండే తరువాత ఎవరు' అన్నదే బిజెపి ముందున్న ప్రశ్న!