papanna
-
రాతికోటకు బీటలు
సాక్షి, జనగామ: మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి బహుజన రాజ్య స్థాపనకు నడుం కట్టిన సర్దార్ సర్వాయి పాపన్న రాతి కోటకు బీటలు పడుతున్నాయి. నాటి గోల్కొండ రాజ్యాన్ని జయించి విజయ కేతనం ఎగురేసిన కోటను ఇప్పుడు పట్టించుకునే నాథుడు లేక కూలిపోయే దశకు చేరుకుంది. టూరిజం స్పాట్‌గా గుర్తించి నిధులు కేటాయించినా కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న క్రీ.శ 17వ శతాబ్దంలో రాతి కోటను నిర్మించారు. రాజ్య విస్తరణలో భాగంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండపై కన్నేసి దండయాత్రకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే క్రీ.శ.1687 లో గోల్కొండను ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. ఈ కాలంలో మొఘల్ పాలకులు నియమించిన సుబేదార్ల ఆగడాలతో రాజ్యంలో ఆరాచకం నెలకొంది. ప్రజలు అణచివేతకు గురవుతున్న సమయంలో క్రీ.శ. 1650లో పాపన్న జన్మించారు. గౌడ కులంలో జన్మించిన పాపన్న పశువుల కాపరిగా, తర్వాత కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగించారు. పాలకులు విధానాల కారణంగా పాపన్నలో రాజ్యకాంక్ష పెరిగింది. బలహీన వర్గాలు ఏకమైతేనే రాజ్యా ధికారానికి రావచ్చని సొంతం సైన్యం ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టారు. మొగల్ పాలకులపై తిరుగుబాటును ప్రకటించిన పాపన్న తొలి కోటను ఖిలాషాపూర్‌లోనే నిర్మించి నట్లుగా చరిత్రకారుల అభిప్రాయం. ఔరంగజేబు మర ణించాక మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి పలు కోటలను పాపన్న స్వాధీనం చేసుకున్నారు. ఖిలాషాపూర్ కోట కేంద్రంగా వరంగల్, భువనగిరి, గోల్కొండను వశపర్చుకున్నారు. రాతి కోట నిర్మాణం ఇలా.. ఖిలాషాపూర్‌లో పాపన్న క్రీ.శ 1675లో రాతి కోటను నిర్మించారు. 20 అడుగుల ఎత్తులో రాతి కోటను నిర్మించారు. ఆ కోటపై నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తుతో బురుజులు, మధ్యలో మరో బురుజును నిర్మించారు. దూర ప్రాంతాల నుంచి శత్రువులు దండెత్తి వస్తే సులువుగా గుర్తించే విధంగా కోటను నిర్మాణం చేశారు. అంతేకాకుండా కోట సొరంగ మార్గాలను సైతం తవ్వించినట్లుగా చరిత్రకారులు, స్థానికులు చెబుతున్నారు. శత్రు దుర్భేధ్యంగా పూర్తిగా రాతితో కోట నిర్మాణం చేశారు. చెదిరిపోతున్న కోట ఆనవాళ్లు.. బహుజన రాజ్య స్థాపకుడిగా గుర్తింపు పొందిన పాపన్న నిర్మించిన రాతి కోట ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. కోట లోపలి భాగం ధ్వంసం అవుతోంది. గోడలు కూలిపోతున్నాయి. 2017 జనవరిలో కోట మరమ్మతు కోసం టూరిజం శాఖ రూ. 3 కోట్లు కేటాయించింది. అయినా పనులు చేపట్టకపోవడంతో కోట అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు టూరిజం శాఖ చైర్మన్ పేర్వారం రాములు సొంత గ్రామంలోనే ఈ కోట ఉండటం గమనార్హం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కోట అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి
సూర్యాపేట : తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను గురువారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు భూపతి నారాయణగౌడ్, నియోజకవర్గ కన్వీనర్ దేశగాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘం నాయకులు మాట్లాడారు. జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలన్నారు. అనంతరం సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బైరు వెంకన్నగౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, శనగాని రాంబాబుగౌడ్, యూత్ కాంగ్రెస్ అ««ధ్యక్షులు బైరు శైలెందర్గౌడ్, నేరెళ్ల మధుగౌడ్, సత్యనారాయణ, టైసన్ శ్రీను, పల్సా వెంకన్న, రవి, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, బెల్లంకొండ రాంమూర్తిగౌడ్, పొలగాని బాలుగౌడ్, వెంకటనారాయణ, చీకూరి ప్రకాష్‌గౌడ్, వేణు, భూపతి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
శ్రీరాములపల్లి (కమలాపూర్) : మండలంలోని శ్రీరాములపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను వరంగల్ జిల్లా గౌడ యువసేన అధ్యక్షుడు జనగాని రాజేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం రాజేందర్‌గౌడ్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు గౌడ కులస్తులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకుడు పల్లెల రాజు, కౌండిన్య యూత్ అధ్యక్షుడు జక్కు మధు, జక్కు గోపి, జనగాని సురేశ్, దూలం నిరంజన్, జనగాని మహేశ్, జనగాని శ్రీకాంత్, గుర్రం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.