పత్రాల లీక్ కేసులో ‘రక్షణ’ కార్మికుడు అరెస్ట్
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంలో అరెస్టయినవారి సంఖ్య 13కు చేరిం ది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ కార్మికుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. చమురు శాఖలో పత్రాల లీక్‌లో కీలక నిందితుడికి అతను నకిలీ ఐడీ కార్డును అందించి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బొగ్గు, విద్యుత్ మంత్రి త్వ శాఖల్లోనూ పత్రాల లీక్ వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. పత్రాల లీకేజీలో రక్షణ శాఖలో క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తున్న వీరేందర్‌కుమార్ నిందితులకు సహకరించి నట్లు పోలీసులు గుర్తించారు.
ఇండియన్ డిఫె న్స్ అకౌంట్స్‌సర్వీస్ అధికారి ఐడీ కార్డును వీరేందర్ దొంగిలించి నకిలీ కార్డును తయారుచేసి నిందితులు లల్తా ప్రసాద్, రామ్‌కుమార్ కు ఇచ్చాడని, దాంతోపాటు రక్షణ శాఖ లెటర్‌హెడ్‌ను వాడుకుని వాళ్లు వివిధ శాఖల్లోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు చెప్పారు. కాగా కార్పొరేట్ గూఢచర్యం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలని కాంగ్రెస్ లోక్‌సభలో డిమాండ్ చేసింది.