ముగిసిన ఆరాధనోత్సవాలు
నారాయణపేట రూరల్ : పట్టణంలోని పరిమళపురం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఉత్తరాధనోత్సవాలను పురష్కరించుకుని స్వామి మహరథోత్సవాన్ని భక్తులు కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతం, నిర్మాల్యం, అష్టోత్తర పారాయణం, పంచామతాభిషేకం, పల్లకిసేవా, కనకాభిషేకం, సర్వసేవా, మహమంగళహరతి నిర్వహించారు. చిన్నారులు వివిధ వేషధారణలతో చేసిన హరిదాసుల సంకీర్తనలు, సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా జోషి రఘుప్రేమ్చారి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. కోడ్లి అక్షోభ్యతీర్థ మఠాధిపతి శ్రీరఘుప్రేమతీర్థులు వందేళ్లక్రితం నారాయణపేటలో శోడశబహులక్ష్మి నర్సింహసమిత శ్రీరాఘవేంద్రస్వామిని ప్రతిష్ఠించారని, ఇక్కడ స్వామి వారిని కొలిచిన భక్తులకు అష్ట ఐశ్యర్యాలు సిద్ధిస్తాయన్నారు. కార్యక్రమంలో అర్చకులు నర్సింహచారి, ఆదోని మురళీధర్ ఆచారి, యాద్గీర్ విద్వాన్ శ్రీనాథచారి, సేవాసమితి సభ్యులు రాఘవేందర్రావు, సుధాకర్‌రావు, కొల్లూర్ భీంసేన్రావు కులకర్ణి, శ్రీపాద్, నారాయణరావు, శేషు, రాజు వార్కార్, ముంజి కిశోర్, సీతారామారావు, హన్మేష్, ప్రసాద్, రవి, రామారావు, శ్రీధర్‌రావు, వెంకుశాస్త్రి, జయతీర్థ, అజిలాపూర్ రాఘవేంద్ర పాల్గొన్నారు.