parsa satyanarayana
-
కార్మికోద్యమ పితామహుడు పర్సా సత్యనారాయణ
ఉద్యమాలనే ఊపిరిగా చేసుకుని కార్మికుల హక్కు ల కోసం రాజీలేని పోరాటం చేసిన ఉద్యమ కెరటం నింగికేగింది. కార్మిక ఉద్యమ ధ్రువతారగా వెలిగిన పర్సా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక ఉద్య మం వేళ్లూనడానికి, కార్మికులు తమ హక్కులకోసం ప్రశ్నించే చైతన్యం రావడానికి పర్సా సత్యనారా యణ చేసిన కృషి అనిర్వచనీయం. 1924 జూన్ 2వ తేదీన జన్మించిన పర్సా కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. కార్మిక ఉద్యమ వ్యూహలను రూపొందించడంలో దిట్టగా పేరున్న ఆయన తన జీవితమంతా ఉద్య మాలకే ధారపోసారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన తొలి నాళ్లలోనే నైజాం ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రజలను సమీకరించి సాయుధ పోరుకు సిద్ధం కావడమే కాకుండా పాల్వంచ ఏరియా దళ కమాండర్‌గా పనిచేసి నిజాం అకృత్యాలపై పోరు సలిపిన నేతగా పేరొందారు. కార్మికులకు ప్రత్యే కంగా సంఘం ఉండాలని, కార్మికుల హక్కుల సాధన నిరంతర పక్రియ అనీ భావించిన పర్సా సి.ఐ.టి.యు. కార్మిక సంఘం వ్యవస్థాపకులలో అగ్రగణ్యుడిగా నిలిచారు. శత్రు వుకు తలవంచడం అంటే తెలి యని పర్సా కార్మికుల జీవితాలలో వెలుగు నింప డానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నాడు. ఈక్రమంలోనే సింగ రేణి కార్మికులెదుర్కొంటున్న సమస్య లపై సమర శంఖం పూరించడానికి ఆయన ఆద్యు డిగా నిలిచారు. ఇందుకుగాను పర్సా సింగరేణి కాల రీస్ ఎంపాయిస్ యూనియన్ ను స్దాపించారు. గని కార్మికుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటా లను ఈ యూనియన్ ద్వారా నిర్వహించారు. కార్మి కులకు మెరుగైన వేతనం ఇప్పించడానికి ఆయన చేసిన కృషి గని కార్మికులు ఇప్పటికీ చెప్పు కుం టారు. గుంటూరు జిల్లాకు చెందిన పర్సా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 1943 లో స్థిరపడ్డారు. ఆయ నకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నిజాంకు వ్యతిరే కంగా పోరాడుతున్న క్రమంలో అరె స్టయిన పర్సా 2 సార్లు ఔరం గాబాద్ జైలు గోడలు దూకి తప్పిం చుకున్నాడు. దీంతో పర్సా సత్యనా రాయణ ఉద్యమ కదలికలపై ప్రత్యే క నిఘా పెట్టిన నైజాం సర్కార్ ఆయనను డేంజరస్ ప్రిజనర్‌గా ప్రక టించింది. సాధారణంగా ఖైదీలను ఉంచే చెర సాలలో కాకుండా ఆయనను 6 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తున్న చీకటి చెరసాలలో నెలల తరబడి బంధించింది. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన నాటి నుండి కార్మిక శ్రేయస్సు కోసం పాటుబడిన పర్సా 1970 నుండి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ర్ట అధ్యక్షుడిగా సుధీర్ఘకాలం పనిచే శారు. అలాగే సిఐటియు అఖిల భారత కమిటీ ఉపా ధ్యక్షుడిగా పనిచేసిన పర్సా దేశంలోని కార్మికచట్టాలు కార్మికులకు ఉపయోగపడేలా ఉద్యమాలు నిర్వహిం చారు. సిపిఎం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన 1962లో పాల్వంచ శాసనసభా నియోజక వర్గంనుంచి ఎంఎల్ఏగా గెలుపొందారు. 1984లో ఖమ్మం లోక్‌సభా స్థానం నుండి జలగం వెంగళరా వుపై పోటీచేసి ఓడిపోయారు. సుదీర్ఘకాలం కమ్యూ నిస్ట్ ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన పర్సా కార్మిక పక్షపాతిగానే గుర్తింపు పొందారు. వృద్ధాప్యం దరి చేరినా ఉద్యమాల్లో తన క్రియాశీలతను మాత్రం తగ్గించలేదు. పార్టీ సభలు సమావేశాలు ఎక్కడ ఉన్నా క్రమంతప్పకుండా హజరుకావడం కమ్యూ నిస్ట్ పార్టీపట్ల ఆయనకు గల నిబద్ధతకు నిదర్శనం. 91 సంవత్సరాలపాటు కమ్యూనిస్ట్‌గా జీవించిన పర్సా మే 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూ రులో కుమార్తె ఇంటివద్ద తుది శ్వాస విడిచారు. - పి.రాజారావు (సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొబైల్: 9441209559) -
కమ్యూనిస్టు యోధుడు పర్సా కన్నుమూత
- పాల్వంచ ఎమ్మెల్యేగా సేవలు.. నేడు కొత్తగూడెంలో అంత్యక్రియలు కొత్తగూడెం: తొలితరం కమ్యూనిస్టుయోధుడు, సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ(91) శుక్రవారం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కన్నుమూశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంభంపాడుకు చెందిన వెంకట సుబ్బమ్మ, వెంకటరామరాజు దంపతులకు 1924లో ఆయన జన్మిం చారు. సత్యనారాయణ 1940 ప్రాంతంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం వచ్చి కమ్యూనిస్టు యోధులు శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యలతో కలిసి కార్మికోద్యమాలను నిర్మించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిం చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొత్తగూడెం, పాల్వంచ దళాలకు నాయకత్వం వహించారు. నిజాం ప్రభుత్వం ఆయనను జై ళ్లలో నెలల తరబడి బంధించింది. నిజాం సైన్యం ఆయనను కాల్చేయమని ఆజ్ఞాపించినా పోలీస్ అధికారి సహాయంతో ఆయన మరణం నుంచి తప్పించుకున్నారు. 1957లో పీడీఎఫ్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలోని అప్పటి పాల్వంచ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1962లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో సీపీఎం తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1970లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయూస్ యూనియన్(సీఐటీయూ)ను నెలకొల్పి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. సత్యనారాయణకు భార్య భారతీదేవి, ఇద్దరు కుమారులు చక్రపాణి, మురళి, ముగ్గురు కుమార్తెలు వాణి, పద్మశ్రీ, లీల ఉన్నారు. ఐదేళ్లుగా ఏలూరులోని చిన్నకుమార్తె లీల వద్ద ఉంటున్నారు. ఆయన మృతదేహాన్ని ఏలూరు నుంచి కొత్తగూడెం తరలించనున్నారు. శనివారం జరిగే పర్సా అంత్యక్రియల్లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పలు రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. సీపీఎం సంతాపం హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ మృతికి సీపీఎం సంతాపం ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో జరిగిన సంతాపసభలో పర్సా చిత్రపటానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు, కార్మికోద్యమ చరిత్రలోని కీలకమైన ఘట్టాల్లో పర్సా పాత్ర ఉందని రాఘవులు అన్నారు. పర్సా సత్యనారాయణ మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరె డ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. పర్సా మృతి కార్మికవర్గానికి తీరని లోటని నివాళులర్పించారు.