Patanjali Ayurvedics
-
కరోనాకు ఔషదాన్ని విడుదల చేస్తున్నాం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ను తయారు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే 13 రకాల వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించారు. మరో 120 కి పైగా సంస్థలు ఈ మందు తయారీలో నిమగ్నమయ్యాయి. తాజాగా యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనా నివారణకు 'కరోనిల్' అనే ఆయుర్వేద ఔషదాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పతంజలి యోగ్‌పీఠ్ సహవ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. పతంజలి సంస్థ తయారుచేసిన ఔషదం 80 శాతం సక్సెస్‌ను చూపించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం మధ్యాహ్నం హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు బాలకృష్ణ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. చదవండి: 'కరోనా నివారణకు ప్రత్యేక వ్యాక్సిన్' Proud launch of first and foremost evidence-based ayurvedic medicine for #corona contagion, #SWASARI_VATI, #CORONIL, is scheduled for tomorrow at 12 noon from #Patanjali Yogpeeth Haridwar🙏🏻 pic.twitter.com/K7uU38Kuzl — Acharya Balkrishna (@Ach_Balkrishna) June 22, 2020 -
ఫ్యూచర్ గ్రూప్‌తో రాందేవ్ బాబా ఒప్పందం
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేదిక్స్.. ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ ఫ్యూచర్ గ్రూప్ తో కీలక వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. పతంజలి సంస్థ తయారుచేసే ఉత్పత్తులను.. 240 నగరాల్లోని రిటైల్ అవుట్ లెట్లలో విక్రయించనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే 20 నెలల కాల వ్యవధిలో వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరుపనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లాంటి స్వదేశీ రిటైల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ సంస్థకు రెట్టింపు గౌరవం దక్కుతుందని, తద్వారా ప్రపంచ శ్రేణి ఉత్పత్తుతులను తక్కువ ధరకే అందించే వీలుంటుందన్నారు. 20015- 16 ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోపు పతంజలి ఫుడ్స్ టర్నోవర్ రూ. 5 వేల కోట్లకు చేరుకుంటుందని రాందేవ్ చెప్పారు. మ్యాగీ నిషేధం తరువాత తమ సంస్థ రూపొందించిన దేశీ ఆటా నూడుల్స్ విక్రయాలను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు, ఒక్కో ప్యాకెట్ ధర రూ. 25గా నిర్ధారించినట్లు వివరించారు.