ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన రైతులు
నెల్లిమర్ల (విజయనగరం జిల్లా): భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సోమవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల అధికార పార్టీ ఎమ్మెల్యే పత్తివాడనారాయణ స్వామి నాయుడు ఇంటిని బాధిత రైతులు ముట్టడించారు.
ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని బాధితులు ఎమ్మెల్యే పత్తివాడను కోరారు. ఎమ్మెల్యే మాత్రం ఎయిర్ పోర్టు అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యేని గృహంలోనే నిర్భందించారు.