Patrols
-
మార్కెట్లోకి ఫోర్డ్ ‘ఫిగో’ 2019 ఎడిషన్
ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తన హ్యాచ్‌బ్యాక్ కారు ‘ఫిగో’లో నూతన ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈకారు విడుదల కాగా, ధరల శ్రేణి రూ.5.15 లక్షలు నుంచి రూ.8.09 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. 1.2 లీటర్లు, 1.5 లీటర్ల ఇంజిన్ సామర్థ్యంతో విడుదలైన నూతన ఫిగోలో.. టాప్ ఎండ్ మోడల్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఎలెక్ట్రోక్రోమిక్ మిర్రర్ లాంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. 1,200లకు మించిన నూతన భాగాలు, సమగ్ర పునఃరూపకల్పన, మెరుగైన భద్రతా సాంకేతికత, నూతన ఇంజిన్ ఈ ఏడాది ఎడిషన్ ప్రత్యేకతలుగా తెలిపింది. -
డిస్కౌంట్లపై వాహనదారులకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కారు, మోటార్ వాహనాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో కేంద్రం వైఖరి మారింది!. పెట్రోల్ పంపుల వద్ద డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకానికి కేంద్రం కోత పెట్టేసింది. ప్రారంభించి 20 నెలలు కాకుండానే చమురు కంపెనీలు ప్రోత్సహకాల భారం తగ్గించుకున్నాయి. బిల్లు మొత్తంలో 0.75% ప్రోత్సాహకాన్ని 2016 డిసెంబర్ 13 నుంచి ఇస్తుండగా, దీన్ని 0.25%కి తగ్గించాయి. పెట్రోల్ పంపు నిర్వాహకులకు కంపెనీలు ఎస్ఎంఎస్ ద్వారా విషయాన్ని తెలిపాయి. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని, ఈ విషయాన్ని కస్టమర్లకు తెలపాలని డీలర్లను కోరాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈ–వ్యాలెట్ల ద్వారా చేసే చెల్లింపులకు ప్రస్తుతం ప్రోత్సాహకం లభిస్తోంది. లీటర్ పెట్రోల్‌పై 57 పైసలుగా ఉన్న క్యాష్‌బ్యాక్ 19 పైసలకు, డీజిల్‌పై 50 పైసల ప్రోత్సాహకం 17 పైసలకు తగ్గింది. వివిధ ప్రాంతాల్లో అమ్మకం ధర ఆధారంగా ఈ క్యాష్‌బ్యాక్ ఆధారపడి ఉంటుంది. త్వరలో మిగిలిన వాటికీ కోత..: నగదు తిరిగి వ్యవస్థలోకి సమృద్ధిగా వచ్చిందని, డిజిటల్ చెల్లింపులు తగ్గాయని అధికార వర్గాలు తెలిపాయి. 2016 డిసెంబర్లో ప్రారంభించిన ఇతర డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకాలకూ ఇదే విధంగా కోత విధించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సాధారణ బీమా ఉత్పత్తులను ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ప్రీమియంలో 10%, జీవిత బీమా ఉత్పత్తులపై 8% ప్రీమియం తగ్గింపును 2016 డిసెంబర్లో అమల్లోకి తీసుకొచ్చారు. సబర్బన్ రైల్వే నెలవారీ సీజనల్ టికెట్లపై డిజిటల్ రూపంలో చెల్లింపులకు 0.5% తగ్గింపు, టోల్ ప్లాజాల్లో ప్రీపెయిడ్ కార్డులతో చెల్లిస్తే 10% తగ్గింపు కూడా ఉన్నాయి. రూ.2,000 వరకు చెల్లింపులను క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చేస్తే సర్వీస్ ట్యాక్స్ కూడా మినహాయించారు. 2,000 వరకు డెబిట్ కార్డు, భీమ్ యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలను సైతం కేంద్రమే భరిస్తోంది. -
గస్తీని ముమ్మరం చేయాలి
ఎస్పీ విష్ణు వారియర్ తానూరు(ముథోల్) : సరిహద్దు ప్రాంతంలో ఉన్న ముథోల్ మండలంలో గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ విష్ణు వారియర్ పోలీ సులను ఆదేశించారు. శనివారం ముథోల్‌లోని పో లీస్స్టేషన్ను ఆయన సం దర్శిం చారు. సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టాలన్నారు. సరిహద్దుకు వెళ్లే అన్ని మా ర్గాలపై నిఘా పెంచాలన్నా రు. ఈ మార్గం గుండా అనుమతి లేని పత్రాలతో వచ్చే సరుకుల వాహనాలను పరి శీలించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పన్నులు చెల్లించకుండా అడ్డదారుల్లో అక్రమంగా వెళ్లే వాహనాలపై దృష్టిపెంచాలన్నారు. ముథో ల్, తానూరు మండలాల సరిహద్దుల్లో నుంచి వచ్చే మహారాష్ట్ర దేశీదారుకు అడ్డుకట్ట వేయాలని సూ చించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు గానూ డ్రైవర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేయాలన్నారు. ఇదే క్రమంలో ప్రజలకు చేరువై వారు కోరుకునేలా పోలీసుల సేవలు అందాలని చెప్పారు. శాంతి భద్రతలపై దృష్టిసారించాలి భైంసా : శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ విష్ణు వారియర్ సూచించారు. శనివారం భైంసా డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. డీఎస్పీ అందె రాములు, పట్టణ, రూరల్ సీఐలు రఘు, వినోద్‌లతోపాటు ఎస్సైలతో సమావేశమయ్యారు. డివిజన్ పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు డివిజన్ పరిధిలో నమోదైన కేసులు విచారణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. -
దారుణంపై వెల్లువెత్తిన నిరసనలు
దేశ రాజధానిలో ‘నిర్భయ’ ఘటన నుంచి తేరుకోకముందే రాష్ట్ర రాజధానిలో ‘అభయ’ ఘటన జరగడంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఇంత పెద్ద మహానగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దారుణానికి ఒడిగట్టిన కీచకులను ఆషామాషీగా కాకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘అభయ’ ఘటనను వ్యతిరేకిస్తూ బుధవారం నగరంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. మహిళా సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. భారతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. భారీగా చేరుకున్న మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి రక్షణ కల్పించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళలపై అఘాత్యాయిల నివారణకు ప్రత్యేక చట్టాలు చేసినప్పటికీ లైంగిక వేధింపులు, అత్యాచారాలను నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరి దుయ్యబట్టారు. రాజేంద్రనగర్‌లో బీజేపీ మహిళా మోర్చా నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్జీరంగా వర్సిటీ క్రీడాప్రాంగణం నుంచి ప్రేమావతీపేట బస్తీ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రామక ృష్ణ విమర్శించారు. ‘అభయ’ ఘటనను వ్యతిరేకిస్తూ రాంనగర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న నగరంలో ‘అభయ’లాంటి ఘటనలు నగరస్థాయిని దిగజారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ను ఉద్ధృతం చేయాలని, బహిరంగప్రదేశాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచాల ని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి డిమాండ్ చేశారు. మహిళలపై వేధింపులు,అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గోల్కొండ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహానగరంలో జరుగుతున్న ఘటనలతో మహిళా ఉద్యోగులు ఇంటికొచ్చే వరకు తల్లిదండ్రులు భయపడాల్సిన దుస్థితులు ఏర్పడ్డాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.లక్ష్మణ్ అన్నారు. మాదాపూర్ సైబర్‌టవర్ వద్ద అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు క్యాబ్‌లలో ప్రయాణించొద్దని..ఐటీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ఆర్టీసీ సర్వీసులను పెంచాలని డిమాండ్ చేశారు. -
నిఘా లేకే దారుణాలు
సాక్షి, సిటీబ్యూరో : నవ దంపతులు.. వారాంతంలో దైవదర్శనం కోసం వచ్చారు... తిరిగి వెళ్తూ రోడ్డు పక్కగా ఆగడమే వారు చేసిన పాపం... కర్కశంగా దాడి చేసిన ముగ్గురు దుండగులు భర్త వెంకటేశ్వరరావును హతమార్చి, భార్య సౌజన్యపై హత్యాయత్నం చేసి దోచుకున్నారు. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. సంఘీ టెంపుల్ దారిలో శనివారం జరిగిన దారుణమిది. నగర శివార్లలో సంఘీనగర్‌లో ఉన్న సంఘీ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయం వద్ద భద్రత విషయంలో ఢోకా లేకపోయినా... దానికి వెళ్లే దారి మాత్రం ‘ముళ్ల బాటే’. అనేకమంది భక్తులతో పాటు ప్రేమ పక్షులు నిత్యం ఇక్కడ కనిపిస్తుంటారు. వీరిపై దాడులు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయి. పోలీసుల గస్తీ, నిఘా ఉండాల్సిన స్థాయిలో లేకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకాంతం కోరుకోవడమే ఇబ్బంది సంఘీ ఆలయానికి వచ్చే దంపతులు, ప్రేమికులు ఆ మార్గంమధ్యలో ఏకాంతంగా కాసేపు సేద తీరాలని కోరుకుంటుంటారు. ఇదే నేరగాళ్లకు అనువుగా మారుతోంది. కొన్ని ప్రాంతాలకు చెందిన యువకులు, పాత నేరగాళ్లు ఇక్కడ తిష్ట వేసి కనిపించిన వారిని అడ్డగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కంచే చేను మేసిన చందాన హోంగార్డులూ బెదిరింపులకు పాల్పడి వసూళ్లు చేసిన ఉదంతాలున్నాయి. దంపతులపై జరిగిన నేరాలు బయటకు వచ్చినా... అనేక కారణాలతో ప్రేమికులు తమకు ఎదురైన అనుభవాలను సైతం బయటకు చెప్పుకోలేరు. ఇదే అసాంఘికశక్తులు, నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సంఘీ మార్గంలో సాధారణ రోజుల్లో అవసరమైన స్థాయిలో, వారాంతాలు, సెలవు దినాల్లో పెట్రోలింగ్, నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.