గస్తీని ముమ్మరం చేయాలి
ఎస్పీ విష్ణు వారియర్
తానూరు(ముథోల్) : సరిహద్దు ప్రాంతంలో ఉన్న ముథోల్ మండలంలో గస్తీని ముమ్మరం చేయాలని ఎస్పీ విష్ణు వారియర్ పోలీ సులను ఆదేశించారు. శనివారం ముథోల్‌లోని పో లీస్‌స్టేషన్ను ఆయన సం దర్శిం చారు. సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టాలన్నారు. సరిహద్దుకు వెళ్లే అన్ని మా ర్గాలపై నిఘా పెంచాలన్నా రు. ఈ మార్గం గుండా అనుమతి లేని పత్రాలతో వచ్చే సరుకుల వాహనాలను పరి శీలించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పన్నులు చెల్లించకుండా అడ్డదారుల్లో అక్రమంగా వెళ్లే వాహనాలపై దృష్టిపెంచాలన్నారు.
ముథో ల్, తానూరు మండలాల సరిహద్దుల్లో నుంచి వచ్చే మహారాష్ట్ర దేశీదారుకు అడ్డుకట్ట వేయాలని సూ చించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు గానూ డ్రైవర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేయాలన్నారు. ఇదే క్రమంలో ప్రజలకు చేరువై వారు కోరుకునేలా పోలీసుల సేవలు అందాలని చెప్పారు.
శాంతి భద్రతలపై దృష్టిసారించాలి
భైంసా : శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ విష్ణు వారియర్ సూచించారు. శనివారం భైంసా డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. డీఎస్పీ అందె రాములు, పట్టణ, రూరల్ సీఐలు రఘు, వినోద్‌లతోపాటు ఎస్సైలతో సమావేశమయ్యారు. డివిజన్ పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు డివిజన్ పరిధిలో నమోదైన కేసులు విచారణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.