Pay App
-
నిత్యవసర వస్తువుల అమ్మకాల్లో హిందుస్తాన్ పెట్రోలియం
న్యూఢిల్లీ: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఇంధనేతర వ్యాపారంలోకి ప్రవేశించింది. హ్యాపీ షాప్ పేరుతో తొలి ఔట్‌లెట్‌ను ముంబైలోని క్లబ్ హెచ్‌పీ పెట్రోల్ పంప్లో ప్రారంభించింది. ఆహార పదార్థాలు, సబ్బులు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, బేకరీ, సరుకులు, మందుల వంటివి ఇక్కడ లభిస్తాయి. రోజువారీ అవసరమయ్యే వస్తువులను కస్టమర్ల సౌకర్యార్థం 24 గంటలూ అందుబాటులోకి తేవడం కోసం స్టోర్‌ను తెరిచినట్టు కంపెనీ తెలిపింది. హెచ్‌పీ–పే యాప్ ద్వారా హోమ్ డెలివరీ సౌకర్యమూ ఉంది. ఇతర నగరాల్లోనూ ఇటువంటి కేంద్రాలను ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. ఖరీదైన కార్లు, బైక్స్ కోసం 100 ఆక్టేన్ రేటింగ్‌తో అల్ట్రా ప్రీమియం గ్రేడ్ పెట్రోల్‌ను పవర్ 100 పేరుతో హెచ్‌పీసీఎల్ అందుబాటులోకి తెచ్చింది. చదవండి: స్పెషల్ ఎకనామిక్ జోన్, 2.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు -
సామ్సంగ్ అన్ని స్మార్ట్ఫోన్లలో ‘పే’ యాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామ్సంగ్ అన్ని స్మార్ట్ఫోన్లలో ‘పే’ యాప్‌ను ప్రీ ఇన్స్టాల్ చేయనుంది. 2017 జనవరి నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. గెలాక్సీ నోట్–5, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్ మోడళ్లతో పేయాప్ గతేడాది రంగ ప్రవేశం చేసింది. పే యాప్‌తో చెల్లింపుల కోసం కస్టమర్లు యాప్‌ను తెరిచి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయాలి. వర్తకుని వద్ద నగదు స్వీకరణ కోసం ఉన్న ప్రత్యేక టెర్మినల్‌కు సమీపంగా ఫోన్‌ను ఉంచగానేచెల్లింపులు పూర్తి అవుతాయి. ఇక సామ్సంగ్ పే మొబైల్ పేమెంట్ సేవలు ప్రస్తుతం యూఎస్, స్పెయిన్, బ్రెజిల్, సింగపూర్, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణ కొరియాలో అందుబాటులో ఉన్నాయి. కొద్ది రోజుల్లో భారత్లోనూఅడుగు పెట్టే అవకాశం ఉంది.