pay gap
-
మహిళా సీఈవోలకు జీతం పెరిగింది కానీ..
న్యూయార్క్: ఎస్అండ్పీ 500 కంపెనీలను నడిపించే మహిళా సారథులకు (సీఈవోలు) 2021లో వేతన ప్యాకేజీలు గణనీయంగా పెరిగాయని ఈక్విలర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవడానికితోడు, స్టాక్ ధరలు, లాభాలు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. మహిళా సీఈవోలకు మధ్యస్థ వేతన చెల్లింపులు 26 శాతం వృద్ధితో 16 మిలియన్ డాలర్లకు (రూ.123 కోట్లు) చేరుకున్నట్టు చెప్పింది. ఇప్పటికీ కార్పొరేట్ ర్యాంకులు, వేతన చెల్లింపుల్లో స్త్రీ, పురుషల మధ్య వ్యత్యాసం ఉందని.. లింగ వైవిధ్యం కోసం మరింత కృషి చేయాల్సి ఉందని ఈ నివేదిక పేర్కొంది. ‘‘మహిళా సీఈవోల వేతనం పెరగడం మంచిది. కానీ, ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. అయితే, ఎక్కువ ఆర్జన పొందుతున్న మహిళా సీఈవోలవైపు చూడడం కాకుండా.. వేతన అంతరాన్ని సునిశితంగా చూడాల్సి ఉంది’’అని కార్న్ ఫెర్నీ సీఈవో జేన్ స్టెవెన్సన్ పేర్కొన్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల్లో.. 340 సీఈవోలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల లాభాలు 50 శాతం పెరిగాయి. సూచీలు 27 శాతం వరకు లాభపడ్డాయి. ఈ పనితీరుతోనే ఎక్కువ మంది సీఈవోల పారితోషికం ముడిపెట్టి ఉండడం వల్ల.. ఏళ్ల పాటు మోస్తరు వృద్ధికే పరిమితమైన వేతన ప్యాకేజీలు ఒక్కసారిగా పెరగడానికి దోహదపడింది. మహిళా సీఈవోలకు ప్యాకేజీ పెంపు 26.4 శాతంగా ఉండి 15.8 మిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇదే కాలంలో పురుష సీఈవోలకు పెంపు 17.7 శాతంగా ఉండి 14.4 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
బీసీసీఐ పై అభిమానుల ఆగ్రహం
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతనాలను భారీగా పెంచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపులో పురుష, మహిళా క్రికెటర్లకు వ్యత్యాసం చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత పురుషుల క్రికెటర్లకు కోట్లలో వార్షిక వేతనం ఉండగా.. మహిళా క్రికెటర్లకు లక్షల్లో ఉండటం ఏమిటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రికెటర్లుకు ఇచ్చిన కానుక ఇదేనా? అని నిలదీస్తున్నారు. దేశం తరుఫున ఇరు జట్లు అద్బుతంగా రాణిస్తున్నా జీతాల్లో ఇంత వ్యత్యాసం ఏమిటో ప్రశ్నించండి అని ఒకరంటే.. షేమ్ బీసీసీఐ.. మహిళా టాప్ క్రికెటర్ల జీతాలు పురుషుల సీ గ్రేడ్ ఆటగాళ్ల వేతనాల్లో సగం ఉండటం సిగ్గుచేటని మరోకరు ట్రోల్ చేస్తున్నారు. పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లికి రూ 7 కోట్లు వస్తే మహిళా జట్టు కెప్టెన్‌కు మరి రూ. 50 లక్షలా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక భారత పురుషుల క్రికెటర్ల జీతాలు ఏ+ గ్రేడ్- రూ. 7 కోట్లు, ఏ గ్రేడ్- రూ. 2 కోట్ల నుంచి 5 కోట్లు, బీ గ్రేడ్ - రూ.1 కోటి నుంచి 3 కోట్లు, సీ గ్రేడ్- రూ. 50 లక్షల నుంచి 1 కోటి మేర పెంచారు. ఇటీవల మహిళా క్రికెటర్ల అద్బుతంగా రాణించడంతో అభిమానుల నుంచి ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో వీరి జీతాలు కూడా భారీగా పెరుగుతాయని అందరు భావించారు. కానీ బీసీసీఐ మహిళా దినోత్సవం నాడే మహిళా క్రికెటర్లకు మొండి చెయ్యి చూపించింది. జీతాలు పెంచిన అవి పురుష క్రికెటర్లతో పోల్చితో చాలా తక్కువ. భారత మహిళా క్రికెటర్ల వార్షిక వేతనాలు.. గ్రేడ్ ఏ- 50 లక్షలు, గ్రేడ్ బీ- 30 లక్షలు, గ్రేడ్ సీ -10 లక్షలుగా ప్రకటించారు. ఈ వార్షిక వేతనాల వ్యత్యాసం మరీ ఇంతగా ఉండటం నెటిజన్లకు ఆగ్రహం కలిగిస్తోంది. नारी शशक्तिकरण की धज्जियाँ उड़ा रहा है @BCCI The pay gap b/w the male and female cricket players is so huge. How this gap will uplift the motivation of the women players @PMOIndia @Manekagandhibjp @NCWIndia please look into this @BJP4India @narendramodi @INCIndia @cpimspeak @IYC pic.twitter.com/xvClEyH0a7 — Sachin Dubey (@ISachinDubey) 8 March 2018 -
మగవాళ్లు, మహిళల చెల్లింపుల్లో మరీ ఇంత తేడానా?
లండన్: ప్రపంచ క్రీడారంగంలో అత్యంత ఎక్కువ సంపాదన కలిగిన వ్యక్తి ప్రముఖ అథ్లెట్ క్రిస్టినో రొనాల్డో కాగా, మహిళల్లో ఫుట్‌బాల్ ప్లేయర్ అలెక్స్ మోర్గాన్. ఎండార్స్మెంట్లు, స్పాన్సర్‌షిప్‌లు, క్రీడారంగం చెల్లింపుల ద్వారా రొనాల్డో ఆదాయం ఏడాదికి 880 లక్షల డాలర్లు కాగా, అలెక్స్ మోర్గాన్‌కు వచ్చేది ఏడాదికి కేవలం 28 లక్షల డాలర్లు మాత్రమే. క్రీడారంగంలో మహిళలు, మగవాళ్ల మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంతో ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 14,500 కోట్ల డాలర్ల విలువైన ప్రపంచ క్రీడారంగం నిర్వహణలో మగవాళ్ల ఆధిపత్యం కొనసాగడం ఇందుకు ముఖ్యకారణంకాగా, క్రీడారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం, మహిళా క్రీడల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగా ఉండడం ఇతర కారణాలని యుకే, ఆస్ట్రేలియాకు చెందిన ‘విమెన్ ఆన్ బోర్డ్స్’ అనే గ్రూప్ ఓ నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా బాస్కెట్‌బాల్, క్రెకెట్, గోల్ఫ్, ఫుట్‌బాల్ క్రీడల్లో చెల్లింపుల మధ్య మహిళలు, మగవారి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ కప్ ప్రైజ్ మనీ విషయంలో కూడా ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం కొనసాగుతోంది. 2014లో జరిగిన ఫిఫా మెన్స్ వరల్డ్‌కప్‌కు ప్రైజ్ మనీని 57.60 కోట్ల డాలర్లుగా నిర్ణయించగా, అదే 2015లో జరిగిన ఫిఫా విమెన్స్ వరల్డ్‌కప్ ప్రైజ్ మనీని 1.50 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడల నిర్వహణ బోర్డు లేదా సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం బాగా తక్కువగా ఉండడం, మగవాళ్ల ఆదిపత్యం ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణమని నివేదిక అభిప్రాయపడింది. రియో డీ జెనీరోలో జరిగిన ఇటీవలి ఒలింపిక్స్‌కు ముందున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గవర్నింగ్ బాడీల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతంకన్నా తక్కువగా ఉంది. ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు’లో మొత్తం 15 మంది సభ్యులుండగా నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు చరిత్రలోనే మొదటిసారిగా 2013లో నలుగురు మహిళలను తీసుకోగా, మూడేళ్లు గడిచినా వారి సంఖ్య పెరగలేదు. ప్రపంచవ్యాప్తంగా 28 అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల్లో 18 శాతం మాత్రమే మహిళలు ఉండగా, 129 జాతీయ ఒలింపిక్ కమీటీల్లో 16.6 శాతం మహిళలు మాత్రమే ఉన్నారు. కనీసం వీటిల్లో 20 శాతం మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని 2005లోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్దేశించింది. మాలవి, ఆస్ట్రేలియా, బెర్ముడా, నార్వే, న్యూజిలాండ్, కిరిబతి, సమోవా, టువాలు దేశాల ఒలింపిక్ బోర్డులు, కమిటీల్లో 40 శాతం కన్నా ఎక్కువగా మహిళలు ఉన్నారు. ఆ తర్వాత అమెరికాలో 31.3 శాతం, బ్రిటన్‌లో 26.7 శాతం మహిళలు ఉన్నారు. ఒక్క టెన్నీస్ క్రీడా కమిటీల్లోనే మహిళ భాగస్వామ్యం 2014 నుంచి పెరుగుతూ వస్తోంది. ప్రపంచ క్రీడారంగంలో మహిళలు, మగవాళ్ల మధ్యనున్న ఆర్థిక చెల్లింపుల వ్యత్యాసం, క మిటీల ప్రాతినిథ్యంలోవున్న వ్యత్యాసాన్ని ఓ పద్ధతి ప్రకారం తొలగించేందుకు కృషి చేయాలని కమిటీ ప్రపంచదేశాలకు ఆ నివేదికలో పిలుపునిచ్చింది.