కొత్తగా బీడీ కార్మికుల పింఛన్లు నిలిపివేత
ముకరంపుర: ప్రభుత్వం కొత్తగా బీడీ కార్మికుల పింఛన్ల మంజూరు నిలిపివేసిందని డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు బీడీ కార్మికులు కొత్తగా పెన్షన్ మంజూరు కొరకు ఆర్జీలు సమర్పించకూడదని సూచించారు. ప్రభుత్వం తిరిగి ఉత్తర్వులిచ్చిన వెంటనే పత్రికాముఖంగా తెలియజేస్తామని పేర్కొన్నారు.