Peacocks died
-
విద్యుత్ షాక్తో నెమలి మృతి
జగదేవ్పూర్(గజ్వేల్): విద్యుత్ షాక్తో జాతీయ పక్షి నెమలి మృతి చెందిన సంఘటన మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం గ్రామ సమీపంలోని రోడ్డు దాటుతున్న క్రమంలో అప్పుడే వస్తున్న ప్రజలను, వాహనాలను చూసి బెదిరి పైకి ఎగిరింది. ఈ క్రమంలో పైన విద్యుత్ తీగలకు తగలడంతో షాక్కు గురై కింద పడి చనిపోయింది. ఈ విషయమై గ్రామస్తులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఫారెస్టు రేంజ్ అధికారి కిరణ్, పశువైద్యాధికారితో పోస్ట్మార్టం చేయించారు. అనంతరం నెమలిని అటవీ ప్రాంతంలో పూడ్చివేశారు. -
నాలుగు నెమళ్లు మృత్యువాత
కల్హేర్: పంట పొలాల్లో పిచికారి చేసిన రసాయనిక మందుల నీరు తాగి నాలుగు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. అంతర్గాం శివారులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వెంకట్రాంరెడ్డి వ్యవసాయ పొలం వద్ద నాలుగు నెమళ్లు మృతి చెంది ఉన్నాయి. మరో నాలుగు అస్వస్థతకు గురయ్యాయి. గోపాలమిత్ర శ్రీనివాస్ అస్వస్థతకు గురైన వాటికి ప్రాథమిక చికిత్స చేశారు. పొలాల్లోని రసాయనిక మందుల నీరు తాగడం వల్లే మృతి చెంది ఉంటాయని తెలిపారు. అటవీ శాఖ అధికారులకు అస్వస్థతకు గురైన నెమళ్లను అప్పగించారు. -
వేటగాళ్ల బారిన పడి పది నెమళ్లు మృతి
చేగుంట: వేటగాళ్ల బారిన పడి పది నెమళ్లు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పోతాన్పల్లి మదిరా పోతాన్శెట్టిపల్లి గ్రామశివారులో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ శివారులో ఓ చనిపోయిన నెమలిని గ్రామస్తులు గుర్తించారు. దీంతో వారు రెవెన్యూ, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అటవీ అధికారులు గ్రామానికి చేరుకున్న చనిపోయిన నెమలిని పరిశీలించారు. అనుమానంతో పరిసరాల్లో వెతికి చూడగా మరో చోట్ల నెమలి ఈకలను వేరు చేసి గడ్డి కప్పేశారు. వాటిని పరిశీలించిన ఫారెస్టు అధికారులు సుమారు పది నెమళ్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. గ్రామ శివారులో లభించిన ఆధారాల ప్రకారం ఇది వేటగాళ్లు చేసిన పనే అని అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన నెమలికి చేగుంట పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. నెమళ్లను వేటాడిన విషయమై స్థానిక తహశీల్దార్ నిర్మలతో పాటు రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు.