చేగుంట: వేటగాళ్ల బారిన పడి పది నెమళ్లు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పోతాన్‌పల్లి మదిరా పోతాన్‌శెట్టిపల్లి గ్రామశివారులో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ శివారులో ఓ చనిపోయిన నెమలిని గ్రామస్తులు గుర్తించారు. దీంతో వారు రెవెన్యూ, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అటవీ అధికారులు గ్రామానికి చేరుకున్న చనిపోయిన నెమలిని పరిశీలించారు. అనుమానంతో పరిసరాల్లో వెతికి చూడగా మరో చోట్ల నెమలి ఈకలను వేరు చేసి గడ్డి కప్పేశారు.
వాటిని పరిశీలించిన ఫారెస్టు అధికారులు సుమారు పది నెమళ్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. గ్రామ శివారులో లభించిన ఆధారాల ప్రకారం ఇది వేటగాళ్లు చేసిన పనే అని అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన నెమలికి చేగుంట పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. నెమళ్లను వేటాడిన విషయమై స్థానిక తహశీల్దార్ నిర్మలతో పాటు రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు.
వేటగాళ్ల బారిన పడి పది నెమళ్లు మృతి
Published Fri, Feb 20 2015 1:15 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement