pedakallepalli
-
పుష్కర ఘాట్ పరిశీలన
పెదకళ్లేపల్లి(మోపిదేవి) : దక్షిణకాశీగా పేరొందిన పెదకళ్లేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న పుష్కరఘాట్‌ను జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విజయవాడ కృష్ణానదిపై భారీ వాహనాలను నిషేదించినట్లు చెప్పారు. ఒంగోలు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లే, మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్‌ను మళ్లించడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మోనిటరింగ్ చేస్తామని, ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద క్యూలైనులోనే దర్శనం కల్పించనున్నట్లు వివరించారు. సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు రూట్ వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అనంతరం మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులకోసం చేపడుతున్న చర్యలను ఆలయ ఏసీ ఎం శారదాకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ మూర్తి, ఎస్ఐలు మణికుమార్, రామకృష్ణ, ఆదిప్రసాద్, ఆర్సీ ఏఈ చలపతిరావు, గ్రామ సర్పంచ్ అరజా వెంకట సుబ్బారావు, పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పెళ్లాడమంటే చంపబోయాడు ..
ప్రేమించిన యువతిని కాదని, మరొకరిని వివాహం చేసుకునేందుకు ప్రియుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. తనను వివాహం చేసుకోవాలని అడిగినందుకు స్నేహితులతో కలిసి ప్రేమికురాలిని హత్య చేసేందుకు యత్నించాడు. మోపిదేవి మండలం పెద కళ్లేపల్లిలో ఈ ఘటన జరిగింది. అవనిగడ్డ: ప్రేమించిన యువతిపై ప్రియుడు స్నేహితులతో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మోపిదేవి మం డలం పెదకళ్లేపల్లిలో జరిగిన ఈ ఘటన ఈ ప్రాం తంలో కలకలం సృష్టించింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నంబూరి గౌతమి ప్రియాంక అదే గ్రామానికి చెందిన అనుమకొండ ఈశ్వరరావు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల క్రితం అతడు వేరే యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక తనను వివాహం చేసుకోవాలని కోరింది. ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక బుధవారం రాత్రి బాత్రూమ్కు వెళుతుండగా ముగ్గురు యువకులు గోడ దూకి ఇంటి ఆవరణలోకి చొరబడ్డారు. ఒకరు వెనుక నుంచి ఆమె కళ్లుమూయగా, మరొకరు కేకలు వేయకుండా గమ్ పూసిన పేపర్‌ను నోటికి అడ్డుగా పెట్టాడు. ఇంకో వ్యక్తి నైలాన్ తాడుతో గొంతుబిగించి చంపేందుకు యత్నించాడు. దీంతో ఆమె పెనుగులాడి విడిపించుకుంది. ఆమె కేకలు విని బాబాయి భాస్కరరావు రావడంతో యువకులు పరారయ్యారు. అనంతరం ఆమె స్పృహ తప్పి పడిపోగా, 108లో అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలు ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈశ్వరరావు మోసం చేశాడని, తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. విషయం తెలుసుకున్న సోషల్ యాక్షన్ కమిటీ అవనిగడ్డ అధ్యక్షురాలు టీపీఎం బేగం, మోపిదేవి మండల అధ్యక్షురాలు గండి సుశీల వైద్యశాలకు వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ప్రేమపేరుతో నమ్మించి, తరువాత వదిలించుకో వాలని చూడటం దారుణమని పేర్కొన్నారు. ప్రియాం కకు న్యాయం చేసి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చల్లప ల్లి పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.