penna ahobilam
-
శేష, గోవాహనాలపై లక్ష్మీనారసింహుడు
ఉరవకొండ రూరల్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహోత్సవాల్లో బుధవారం శ్రీవారు శేష, గోవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు నమో నారసింహా అంటూ ముందుకు సాగారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఉత్సవ ఉభయ దాతలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సింహవాహనంపై శ్రీవారు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహామంగళ హారతి, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనారసింహుడు సింహ వాహనంపై కొలువుదీర్చారు. విశేష పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక పల్లకీలో స్వామి వారిని ఊరేగించారు. అలాగే నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి మూల విరాట్‌కు విశేష పుష్పాలతో అలంకరించారు. ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఈఓ రమేష్‌బాబు అధ్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. -
అభివృద్ధికి నోచుకోని ‘పెన్నహోబిలం’
రెగ్యులర్ ఈఓను నియమించని వైనం ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం రెగ్యులర్ ఈఓ లేకపోవడమే. నాలుగేళ్లుగా ఆలయూనికి ఇన్చార్జ్ ఈఓలే బాధ్యతలు వహిస్తుండడంతో ఆలయు అభివృద్ధి కుంటుపడుతోంది. ఆలయ అభివృద్ధిపై ఇన్చార్జ్ ఈఓలు శ్రద్ధ చూపలేకపోయూరన్న వివుర్శలు ఉన్నారుు. 2010లో ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న కృష్ణయ్యు ఆయున స్థానంలో ఉరవకొండ గ్రూప్ టెంపుల్ ఈఓ ఆనంద్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈయన బదిలీతో కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సుధారాణిని డిప్యుటేషన్‌పై ఇక్కడికి వేశారు. రెండేళ్ల అనంతరం అనంతపురం గ్రూప్ టెంపుల్ ఈఓ రమేష్‌కు మళ్లీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. నెల రోజులు తిరగకుండానే తిరిగి గతంలో పనిచేసిన సుధారాణికే బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పంపనూరు సుబ్రవుణ్యేశ్వర స్వామి ఆలయూనికి రెగ్యులర్ ఈఓగా ఉంటూ పెన్నహోబిళం ఈఓగా ఇన్చార్జ్గా కొనసాగతున్నారు. ఆలయూనికి యేడాదికి రూ.80లక్షలు ఆదాయుం వస్తుంది. 2 వేల ఎకరాల వూన్యం కూడ ఉంది. రెగ్యులర్ ఈఓ లేకపోవడంతోనే ఆలయుం అభివృద్ధికి నోచుకోవడం లేదన్న వివుర్శలు వున్నారుు. ఈ విషయంపై జిల్లా దేవాదాయు శాఖ అసిస్టెంట్ కమిషనర్ వుల్లికార్జునను వివరణ కోరగా రెగ్యులర్ ఈఓను నియుమించడం తవు పరిధిలోని లేదని కమిషనర్ పరిధిలో ఉంటుందని తెలిపారు.